Begin typing your search above and press return to search.

చనిపోయిన విలన్.. తెలుగులోనూ నటించాడు

By:  Tupaki Desk   |   8 Nov 2016 9:30 AM GMT
చనిపోయిన విలన్.. తెలుగులోనూ నటించాడు
X
కన్నడ సినిమా ‘మస్తి గుడి’ షూటింగ్ సందర్భంగా ఇద్దరు నటులు దిగ్భ్రాంతికర రీతిలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచి వేసింది. అందరూ చూస్తుండగానే వాళ్లిద్దరి నీటిలో మునిగిపోవడం దారుణమైన విషయం. ఆ ఇద్దరి కుటుంబాల పరిస్థితి తలుచుకుంటే అందరి గుండెలు బరువెక్కుతున్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే.. చనిపోయిన వాళ్లలో ఒకడైన రాఘవ ఉదయ్ కు నీళ్లన్నా.. రిస్కీ స్టంట్లన్నా చాలా భయమట.

ఈ సంగతి ఈ క్లైమాక్ షూట్ ఆరంభం కావడానికి ముందు అతనే ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘‘ఇలాంటి స్టంట్‌ నేను చేయడం ఇదే తొలిసారి. నాకు నీళ్లంటే భయం. అలాగే మొదటి అంతస్తు నుంచి కిందకు చూడాలన్నా కూడా భయమే. దేవుడి దయ వల్ల ఈ స్టంట్‌ పూర్తి చేస్తానని ఆశిస్తున్నా’’ అని ఉదయ్ పేర్కొన్నాడు.

రాఘవ ఉదయ్ తెలుగు సినిమాల్లోనూ నటించిన సంగతి చాలామందికి తెలియదు. అతను ఇటీవలే సునీల్ సినిమా ‘జక్కన్న’లో విలన్ పాత్ర కనిపించాడు. దాంతో పాటు ‘బుల్లెట్ రాణి’ సినిమాలోనూ నటించాడు. కమెడియన్‌ సప్తగిరి హీరోగా నటించిన 'సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌'లోనూ అతను నటించినట్లు సమాచారం. కన్నడలో ఉదయ్ కు చాలా మంచి పేరుంది. అతను చాలా సినిమాల్లో నటించాడు. అవార్డులు కూడా అందుకున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/