Begin typing your search above and press return to search.
నాగార్జున-రాఘవేంద్రరావు సినిమా ఏంటంటే..?
By: Tupaki Desk | 20 Jan 2016 1:30 PM GMTరాఘవేంద్రరావు - అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో చాలా సినిమాలే వచ్చాయి. ఐతే వాటిలో ‘అన్నమయ్య’ చాలా ప్రత్యేకం. తెలుగు సినీ చరిత్రలోనే ఓ మైలురాయి లాంటి సినిమా ఇది. రాఘవేంద్రరావు లాంటి రసిక దర్శకుడు.. నాగార్జున లాంటి రొమాంటిక్ హీరో కలిసి ఇలాంటి సినిమా చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. వాళ్లిద్దరూ ‘అన్నమయ్య’ చేయడం కంటే ఆ సినిమా అంత పెద్ద హిట్టవడం మరింత ఆశ్చర్యం కలిగించింది. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భక్తి చిత్రం ‘శ్రీరామదాసు’ కూడా ప్రేక్షకుల్ని మెప్పించింది. ‘షిరిడి సాయి’ మాత్రం సరైన ఫలితాన్నివ్వలేదు. అయినప్పటికీ వీళ్లిద్దరూ మరో భక్తి ప్రధాన చిత్రం చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యుడిగా ఉన్న రాఘవేంద్రరావు.. మరోసారి వేంకటేశ్వరుని నేపథ్యంలో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. ఈసారి ఆయన వేంకటేశ్వరుని మరో భక్తుడిపై దృష్టిపెట్టారు. ఆ భక్తుడు మరెవరో కాదు.. బాబా హాథీరాం జీ. తిరుమలలో ఈ పేరుతో ఓ మఠం కూడా ఉన్న సంగతి తెలిసిందే. వేంకటేశ్వరుడికి ఈ బాబా వీర భక్తుడు. ఈ భక్తుణ్ని కాపాడ్డానికే వేంకటేశ్వరస్వామి ఏనుగు అవతారంలో భూమ్మీదికి వచ్చాడని ఓ కథ కూడా ఉంది. ఈ భక్తుడి పాత్రను నాగార్జునతో వేయించి.. మరోసారి భక్తి రస చిత్రాన్ని వేంకటేశ్వరుడికి అంకితం చేయాలని భావిస్తున్నారు రాఘవేంద్రరావు. ‘ఊపిరి’ తర్వాత నాగ్ చేసే సినిమా ఇదే కావచ్చని సమాచారం.