Begin typing your search above and press return to search.

ఏకంగా గీతాంజలితో పోలిస్తే ఎలా సారూ?

By:  Tupaki Desk   |   10 Feb 2020 10:00 PM IST
ఏకంగా గీతాంజలితో పోలిస్తే ఎలా సారూ?
X
ఏదైనా ఒక సినిమా ఈవెంట్ జరుగుతుంది అంటే అక్కడ పొగడ్తలతో చంపేస్తారని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. నిజానికి ఏ వేడుకలో కూడా నెగెటివ్ పాయింట్స్ అసలు మాట్లాడరు. సినిమా ఎలా ఉన్నప్పటికీ డప్పు కొట్టడమే పరమావధి అన్నటుగా చెలరేగిపోతూ ఉంటారు. బాగున్న విషయాన్ని బాగుందని చెప్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ క్లాసిక్ సినిమాలతో పోల్చడం మాత్రం అందరికీ నచ్చదు. తాజాగా సీనియర్ దర్శకులు కె. రాఘవేంద్రరావు BA గారు 'జాను' పై పొగడ్తల వర్షం కురిపించారు.

కానీ ఆ డోస్ కొంచెం ఎక్కువైపోయింది. 'జాను' సినిమాను ఏకంగా 'గీతాంజలి'.. 'పదహారేళ్ళ వయసు' సినిమాలతో పోల్చి.. శర్వానంద్-సమంతాలు కమల్-శ్రీదేవి లా నటించారు అంటూ ఎక్కువమంది వాక్కు పడిపోయి.. అవాక్కయ్యేలా చేశారు. నిజానికి 'జాను' సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. స్లో నరేషన్ అని పెదవి విరుస్తున్నారు. కలెక్షన్లలో ఎక్కడ లేని నీరసం కనిపిస్తోంది. సినిమా ఒరిజినల్ లో 1996 నాటి ఎపిసోడ్ ను మార్చి ముందుకు జరపడం గజిబిజీగా మారిందని.. శర్వానంద్ ఏజ్ సరిపోలేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

శర్వా.. సమంతాలు మంచి పెర్ఫామర్లు. అందులో అనుమానం లేదు కానీ డైరెక్ట్ గా కమల్.. శ్రీదేవితో పోల్చడం మాత్రం అతిశయోక్తి తప్ప మరొకటి కాదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే 'గీతాంజలి'.. 'పదహారేళ్ళ వయసు' సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు నమోదు చేసిన చిత్రాలు. 'జాను' ఫ్లాప్ దిశగా పయనిస్తున్న సినిమా. ఎంత సీనియర్ దర్శకులైనా ఈ లాజిక్కులు మర్చిపోతే ఎలా?