Begin typing your search above and press return to search.
అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా పెళ్లిసందD
By: Tupaki Desk | 9 Oct 2021 11:30 PM GMTదర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఇప్పటికి కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పుడు అదే టైటిల్ తో రాబోతున్న సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అప్పటి పెళ్లి సందడికి రాఘవేంద్ర రావు దర్శకుడు కాగా ఇప్పటి పెళ్లిసందD కి రాఘవేంద్ర రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు మరియు టీజర్ ఇంకా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా కలర్ ఫుల్ గా ఉన్నాయి. కేవలం రాఘవేంద్ర రావు నిర్మాత అంటూ ప్రచారం జరుగుతున్నా కూడా పూర్తి దర్శకత్వం ను పర్యవేక్షించినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇది రాఘవేంద్ర రావు మార్క్ మూవీ కనుక ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరాకు ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదల చేయడం కోసం ప్రమోషన్స్ పీక్స్ లెవల్స్ లో నిర్వహిస్తున్నారు. ఏ ఛానల్ లో చూసినా కూడా పెళ్లిసందD బ్యాచ్ కనిపిస్తున్నారు. దసరా సంబరాల పేరుతో ప్రతి ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ కూడా ప్రత్యేక షో లను నిర్వహిస్తున్నాడు. వాటిల్లో అన్నింట్లో కూడా పెళ్లిసందD టీమ్ కనిపిస్తున్నారు. ఇతర షో లు మరియు న్యూస్ ఛానల్స్ ఇలా అన్ని చోట్ల కూడా వీరు కనిపిస్తున్నారు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వీరు కనిపిస్తూ సినిమాపై అంచనాలు ఆసక్తి పెంచుతున్నారు. సినిమా తీయడం కంటే ప్రమోషన్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన సమయం ఇది. అందుకే రాఘవేంద్ర రావు కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
రాఘవేంద్ర రావు మొదలుకుని చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా క్యాష్ షో నుండి మొదలు పెడితే జబర్దస్త్ షో వరకు అన్ని షో ల్లో పాల్గొంటున్నారు. రోషన్ లుక్ మరియు సినిమాలో హీరోయిన్ లుక్ ను చూస్తే ఇదో క్యూట్ లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాగా కామెంట్స్ వస్తున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కు అన్ని ఛానల్స్ ద్వారా ప్రమోషన్స్ చేయడం ద్వారా మరింతగా ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెళ్లి సందడి సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సక్సెస్ ను దక్కించుకుంది. కనుక ఇక కమర్షియల్ గా సినిమా సక్సెస్ దక్కించుకోవడమే తరువాయి అంటూ పెళ్లిసందD అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. రాఘవేంద్ర రావు బ్రాండ్ ఉండటంతో పాటు సూపర్ హిట్ మూవీ టైటిల్ అయిన పెళ్లిసందD అనే టైటిల్ తో రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందనే విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.