Begin typing your search above and press return to search.
లెజెండరీ డైరెక్టర్.. అదే చివరి సినిమానా?
By: Tupaki Desk | 14 Nov 2016 5:30 PM GMTతెలుగులో కమర్షియల్ సినిమాకు అసలైన అర్థం చెప్పిన దర్శకుల్లో రాఘవేంద్రరావు పేరు ముందుగా చెప్పుకోవాలి. బాలీవుడ్ వాళ్లు కూడా మన సినిమా వైపు చూసేలా చేశారాయన. ఆయన కెరీర్లో ఎన్నెన్ని బ్లాక్ బస్టర్లో. వందకు పైగా సినిమాలు తీసి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయారు దర్శకేంద్రుడు. ఐతే కెరీర్లో చాలా వరకు కమర్షియల్ సినిమాలే తీస్తూ వచ్చిన ఆయన ‘అన్నమయ్య’ దగ్గర్నుంచి రూటు మార్చారు. ఆధ్యాత్మిక బాట పట్టారు. ఈ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. గత దశాబ్ద కాలంలో బాగా జోరు తగ్గించేసిన రాఘవేంద్రరావు.. ‘షిరిడి సాయి’ తర్వాత ఇక సినిమాలే చేయరేమో అన్నట్లుగా మౌనం దాల్చారు.
ఐతే ఈ ఏడాది మళ్లీ ‘ఓం నమో వెంకటేశాయ’తో తిరిగి మెగా ఫోన్ పట్టారు. ఐతే దీని తర్వాత మాత్రం దర్శకేంద్రుడికి మళ్లీ సినిమాలు తీసే ఆలోచన లేదట. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ఉన్న రాఘవేంద్రరావు.. మరోసారి తన ఇష్టదైవం మీద సినిమా తీసి.. అంతటితో సినిమాల నుంచి సెలవు తీసుకుందామని నిర్ణయించుకున్నారట. అందుకే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట ఆయన. ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట దర్శకేంద్రుడు. దీని తర్వాత తన అనుభవాన్ని కొత్త తరానికి పంచుతూ కాలం గడిపేయాలని.. మళ్లీ సినిమా తీసే ప్రయత్నం మాత్రం చేయొద్దని ఆయన భావిస్తున్నారట. మరితన చివరి సినిమాలో రాఘవేంద్రుడు ఎలాంటి మాయాజాలం చేస్తాడో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/