Begin typing your search above and press return to search.

50 లక్షలతో దర్శకేంద్రుడి ప్రయోగం!

By:  Tupaki Desk   |   7 Oct 2018 11:01 AM GMT
50 లక్షలతో దర్శకేంద్రుడి ప్రయోగం!
X
ఈమద్య కాలంలో తెలుగు సినిమా బడ్జెట్‌ అమాంతం పెరిగి పోయింది. స్టార్‌ హీరోల సినిమాలు మినిమం 40 నుండి 50 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ బడ్జెట్‌ చిత్రాలతో పాటు మీడియం బడ్జెట్‌ చిత్రాల లో బడ్జెట్‌ చిత్రాలు కూడా ఈమద్య కాలంలో బాక్సాఫీస్‌ ముందుకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద నిర్మాతలు చిన్న సినిమాల విషయంలో ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ‘పెళ్లి చూపులు’ - ‘ఆర్‌ ఎక్స్‌ 100’ - ‘కేరాఫ్‌ కంచరపాలెం’ వంటి చిత్రాలు అతి తక్కువ బడ్జెట్‌ తో రూపొందిన విషయం తెల్సిందే.

స్టార్‌ డైరెక్టర్స్‌ కూడా చిన్న బడ్జెట్‌ చిత్రాలు చేయాలని ప్రయత్నాలు చేసినా కూడా హీరోల ఇమేజ్‌ అడ్డం రావడంతో వారు ఆ సాహసం చేయలేక పోతున్నారు. అయితే స్టార్‌ డైరెక్టర్‌ కే రాఘవేంద్ర రావు ఆ సాహస ప్రయోగం చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు. అప్పట్లో భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచిన రాఘవేంద్ర రావు గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చేసిన అడపా దడపా చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని సొంతం చేసుకోలేక పోతున్న కారణంగా ఈయన సినిమాల కంటే ఇతర విషయాలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్లుగా అనిపిస్తుంది.

రాఘవేంద్రుడికి మళ్లీ సినిమాలపైకి గాలి మళ్లినట్లుగా అనిపిస్తుంది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. తాను 50 లక్షల బడ్జెట్‌ తో కంటెంట్‌ ప్రధానమైన సినిమాను తీయాలని భావిస్తున్నాను. చిన్న బడ్జెట్‌ చిత్రం - కంటెంట్‌ ప్రధానమైన చిత్రాన్ని తెరకెక్కించగల సత్తా నాలో ఉందని నిరూపించుకోవాలనుకుంటున్నాను.

ఈమద్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ప్రయోగాలను స్వాగతిస్తున్నారు, బాగుంటే ఆధరిస్తున్నారు. అందుకే సుకుమార్‌ ‘రంగస్థలం’లో రామ్‌ చరణ్‌ ను చెవిటి వాడిగా చూపించగలిగాడు. నేను అయితే అలాంటి ధైర్యం చేసే వాడిని కాదు అన్నాడు. ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించవచ్చు అనిపిస్తుందని, అందుకే తాను 50 లక్షలతో ఒక చిన్న బడ్జెట్‌ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన ప్రకటించాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెళ్లడి చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.