Begin typing your search above and press return to search.

వాల్మీకి పాటకు వందల కొద్దీ బిందెలు??

By:  Tupaki Desk   |   30 Aug 2019 5:54 AM GMT
వాల్మీకి పాటకు వందల కొద్దీ బిందెలు??
X
హరీష్ శంకర్ దర్శకత్వలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'వాల్మీకి'. ఈ సినిమాలో పూజా హెగ్డే.. తమిళ హీరో అథర్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో వరుణ్ తేజ్ మేకోవర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా ప్రోమోస్ పవర్ఫుల్ గా ఉన్నాయి. హరీష్ తనకు గట్టి పట్టుండే మాస్ జోనర్ లో సినిమా చేస్తుండంతో ఎలాగైనా హిట్ గా మలచాలని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ ప్రయత్నాలలో భాగంగా 'వాల్మీకి' కోసం ఒక కత్తిలాంటి పాటను రీమిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా 'దేవత' లో 'ఎల్లువొచ్చి గోదారమ్మ' పాటను 'వాల్మీకి' కోసం రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. ఆ పాటలో ఎవర్ గ్రీన్ జోడీ శోభన్ బాబు - శ్రీదేవి ఆడిపాడారు. ఆ పాటను గోదావరి ఒడ్డున చిత్రీకరించినప్పటికీ సెట్ ప్రాపర్టీగా వందల కొద్ది బిందెలను వాడడం అప్పట్లో ఒక సెన్సేషన్. బిందెలతో అలాంటి ఫీల్ తీసుకురాచ్చని అప్పటివరకూ ఎవరికీ తెలియదు! ఇప్పుడు ఈ పాటను వరుణ్ తేజ్ - పూజా హెగ్డేలపై చిత్రీకరిస్తున్నారు. మరి ఈ ఈపాటకు కూడా హరీష్ వందలకొద్ది బిందెలు వాడతాడేమో చూడాలి. ప్రస్తుతం ఈ పాటను రాజమండ్రి దగ్గర గోదావరి ఒడ్డున చిత్రీకరిస్తున్నారట.

తమిళ సూపర్ హిట్ ఫిలిం 'జిగార్తాండ' కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ ఒక నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.