Begin typing your search above and press return to search.
ఆయన క్లాస్ రూమ్ లో ఏం చెప్తారు?
By: Tupaki Desk | 1 Jun 2016 10:30 PM GMTదర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు అసామాన్యం. ఒక్కసారి దర్శకేంద్రుడి సినిమాలో నటిస్తే.. గ్లామర్ తో టాప్ హీరోయిన్ అయిపోవచ్చని అందాల భామలు అనుకునేవారు. అంతగా సౌందర్యాన్ని తెరపై పంచిన రాఘవేంద్రరావు.. ఈమధ్య భక్తిరస చిత్రాలను తీసుకుంటున్నారు. ఇప్పుడీయన సినిమా మేకింగ్ లో మెళకువలు చెప్పేందుకు ఓ టీవీ సిరీస్ చేపట్టాలని భావిస్తున్నారు.
ఇందులో ఒక సినిమా రూపొందించడానికి సంబంధించి సలహా - సూచనలతో పాటు.. క్లాసులు కూడా ఉంటాయట. అందుకే ఈ షోకి క్లాస్ రూమ్ అనే పేరు పెట్టాలని యోచిస్తున్నారు దర్శకేంద్రుడు. నిజానికి ఈయనకు ఇదేమీ మొదటి టీవీ షో కాదు. ఇంతుకు ముందు సౌందర్య లహరి అనే ఓ టీవీ ఎపిసోడ్ చేశారు కానీ.. ఒకటి రెండు ఎపిసోడ్స్ తప్ప అంతగా సక్సెస్ కాలేదు. దీనికి కారణం.. ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లని ఈయన పొగుడుతుంటే.. ఆ వచ్చినోళ్లు ఈయన్ని పొగడ్డంతోనే ఎపిసోడ్స్ అయిపోయేవి. దీంతో ఆ షో కథ అలా ముగిసిపోయింది.
ఇప్పుడు నాగార్జునతో ఓ నమో వెంకటేశా చిత్రాన్ని తీసేందుకు రెడీ అవుతున్న రాఘవేంద్రరావు.. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు కూడా. ఆ సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ గ్యాప్ లో.. క్లాస్ రూమ్ టీవీ షోకి ఎపిసోడ్స్ పిక్చరైజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈసారైనా మరీ పొగడ్తల కోసం కాకుండా.. వేరే ఏదైనా కంటెంట్ ఉండేలా ప్లాన్ చేస్తే బెటర్ కదా గురువుగారూ..!