Begin typing your search above and press return to search.
శతాధిక చిత్రాల హీరో వారసుడు ఏమైనట్టు?
By: Tupaki Desk | 10 Oct 2020 11:30 PM GMTదర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన `పెళ్లి సందడి` ఎంతటి సెన్సేషనల్ హిట్టో తెలిసిందే. ఆరోజుల్లోనే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా రికార్డులకెక్కింది. హీరో శ్రీకాంత్ ని పెద్ద స్టార్ ని చేసిన సినిమా ఇది. ఈ సినిమాకి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం పాటలు పెద్ద అస్సెట్. రవళి- దీప్తి భట్నాగర్ నటనను నాటి యూత్ మరువలేరు ఎప్పటికీ.
ఇప్పుడు ఇదే సినిమాని ఇదే టైటిల్ తో శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ వారసుడు రోషన్ తో తీయాలన్నది కె.రాఘవేంద్రరావు ప్లాన్. రోషన్ నూనూగు మీసాల ఏజ్ లో ఉన్నాడు. ఇప్పటికే నిర్మలా కాన్వెంట్ అనే టీనేజీ ప్రేమకథా చిత్రంలో నటించాడు. మూవీ ఫ్లాపైనా రోషన్ మాత్రం మనసులు దోచాడు. టీనేజీ ప్రేమకథలకు రోషన్ సూటవుతాడని .. టాలీవుడ్ కి మరో హ్యాండ్సమ్ హీరో దొరికాడని అప్పట్లో ప్రశంసలు కురిసాయి.
ఇక కె.రాఘవేంద్రరావు చాలా గ్యాప్ తర్వాత తిరిగి పెళ్లి సందడి మూవీతోనే కంబ్యాక్ అవ్వాలని ప్లాన్ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 90లలో సంచలన విజయం సాధించినా ఇప్పుడు మళ్లీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయగలరా? అన్నది వేచి చూడాలి. రాఘవేంద్రరావు మార్క్ రొమాంటిక్ లవ్ స్టోరి ని చూసి చాలా కాలమే అయ్యింది.... కాబట్టి అతడి ప్రయత్నం ఆసక్తిని రేకెత్తించేది... ఛాలెంజింగ్ గా ఉంటుంది. నిర్మలా కాన్వెంట్ ఫ్లాపైంది కాబట్టి ఇప్పుడు రోషన్ రీలాంచ్ అనేది హీరో శ్రీకాంత్ కి చాలా ప్రతిష్ఠాత్మకం. అయినా కొడుకుని సీనియర్ దర్శకుడిని నమ్మి అప్పజెప్పడం ఆసక్తికరం. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావుతో కలిసి శోభుయార్లగడ్డ- ప్రసాద్ దేవినేని నిర్మించనున్నారట. మరకతమణి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తారా.. లేక ఆయన వారసుడు కాలభైరవ బరిలో దిగుతారా? అన్నది చూడాలి.