Begin typing your search above and press return to search.
అన్నమయ్య టు నమో.. ఏం ఎదిగాడులే
By: Tupaki Desk | 9 Jan 2017 9:53 AM GMTనటుడిగా అక్కినేని నాగార్జున కెరీర్లో మైలురాయిలాగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘అన్నమయ్య’ సినిమా ముందుంటుంది. చాలా మోడర్న్ గా కనిపించే నాగార్జున అలాంటి పాత్రను చేయగలడని ఎవ్వరూ అనుకోలేదు. నిజానికి నాగార్జునకు కూడా తన మీద తనకు ఆ పాత్ర చేయగలనని నమ్మకం లేదట. కానీ రాఘవేంద్రరావు నమ్మారు. నాగార్జున నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకున్నారు. ఆపై శ్రీరామదాసు.. షిరిడి సాయి లాంటి సినిమాల్లో కూడా నాగ్ గొప్పగా నటించాడు. ఇప్పుడు ‘ఓం నమో వేంకటేశాయ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఐతే ‘అన్నమయ్య’ దగ్గర్నుంచి ‘ఓం నమో వేంకటేశాయ’ నాగార్జునను దగ్గరగా చూసిన తనకు గొప్ప మార్పు కనిపించిందని.. అప్పటికి ఇప్పటికి నాగ్ ఎంతో పరిణతి సాధించాడని రాఘవేంద్రరావు అన్నారు.
‘‘అన్నమయ్య సినిమా చేసే సమయానికి నాగార్జున ఈ సన్నివేశం ఎలా చేయాలి అని అడిగేవాడు. ఇలా చెయ్యి పెట్టు బాబు.. ఇలా దండం పెట్టు అని నేను చెప్పేవాణ్ని. తర్వాత ‘శ్రీరామదాసు’ సమయానికి ఎలా చేయమంటారు అని అడగలేదు. ఏం డైలాగ్ చెప్పమంటారు అని అడిగేవాడు. ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా విషయానికి వస్తే.. అక్కడ వేంకటేశ్వరస్వామి ఉన్నాడు.. వెళ్లి ఇలా ఈ డైలాగ్ చెప్పు అంటుంటే.. నాకర్థమైందండీ ఎలా చేయాలో తెలుసు అంటూ నా మాట పూర్తి కాకముందే వెళ్లి సన్నివేశాలు పూర్తి చేసేసేవాడు. భక్తుడి పాత్రను చేయడంలో నాగార్జున అంత పరిణతి సాధించాడు. ఈ సినిమాలో దేవుణ్ని చూసేటపుడు నాగార్జున తన కళ్లతో ఇచ్చిన హావభావాలు చూస్తే.. నిజంగానే తన ముందు దేవుడున్నాడనే అనిపించేది. ప్రేక్షకులందరూ నాగార్జున కళ్లతో ఈ సినిమా చూడాలి. అందరికీ నిజంగానే దేవుడు కనిపిస్తాడు. అంత గొప్పగా నటించాడు నాగ్’’ అని రాఘవేంద్రరావు అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/