Begin typing your search above and press return to search.
ఆ రోజుల్లోకి వెళ్లిపోయిన రాఘవేంద్రరావు
By: Tupaki Desk | 25 July 2016 4:58 AM GMTవిక్టరీ వెంకటేష్ 30 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకుంటున్నాడు. ఈ సుదీర్ఘ ప్రయాణానికి పునాది వేసింది దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ఆయన చేతుల మీదుగానే వెంకీ హీరోగా పరిచయమయ్యాడు. ‘కలియుగ పాండవులు’తో వెంకీని హీరోగా నిలబెట్టి స్టార్ హీరోగా ఎదగడానికి కారణమయ్యాడు దర్శకేంద్రుడు. ‘బాబు బంగారం’ ఆడియో వేడుక సందర్భంగా నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు రాఘవేంద్రరావు.
‘‘కొన్ని టైటిల్స్ వెంటనే జనాలకు నచ్చేస్తాయి. బాబు బంగారం అలాంటి టైటిలే. వి అంటే విక్టరీ అని పాపులరైంది కలియుగ పాండవులు సినిమాతోనే. అందులో వెంకీ ఇంట్రడక్షన్ సీన్లో వెంకీతో ఆ డైలాగ్ చెప్పించాను. అందులో వెంకీ మెట్లు ఎక్కుతూ వి ఫర్ విక్టరీ అంటాడు. వెంటనే అతడి మీద పూలు పడతాయి. కొందరు అలా మెట్లు ఎక్కడం ఏంటండీ అన్నారు. కానీ వెంకీ ఒక్కో మెట్టూ ఎక్కాలనే అలా పెట్టాం. వెంకీ ఎప్పుడూ పైనే ఉంటాడు. అతడి మీద పూలు పడుతూనే ఉంటాయి. రామానాయుడిగారి బేనర్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా. మా నాన్న అంతకుముందే ఆ బేనర్లో సినిమాలు తీశారు. తర్వాత నేను దేవత సినిమాను తెలుగులో.. హిందీలో తీశా. సురేష్ బాబును నిర్మాతగా నాకు అప్పగించిన నాయుడు గారు.. తర్వాత వెంకీని హీరోగా పరిచయం చేయమన్నారు. హీరోల కొడుకుల్ని పరిచయం చేయడం వేరు.. నిర్మాతల కొడుకుల్ని పరిచయం చేయడం వేరు. తొలి సినిమాలో నెగెటివ్ టచ్ ఉండి.. తర్వాత పాజిటివ్ గా మారే పాత్రను వెంకీతో చేయించాను. ఆ సినిమా 25 వారాలాడింది. కలియుగ పాండవులు ఆగస్టు 14న రిలీజైతే.. యాదృచ్ఛికంగా ఆ సినిమా వచ్చి 30 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఆగస్టు 12న బాబు బంగారం రిలీజవుతోంది. ఇది కూడా 25 వారాలు ఆడుతుందని ఆశిస్తున్నా’’ అని రాఘవేంద్రరావు చెప్పారు.