Begin typing your search above and press return to search.
రాఘవేంద్రరావు.. ‘బి.ఎ’ కథ
By: Tupaki Desk | 21 Jan 2016 1:30 AM GMTపేరు వెనక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వేసుకోవడం ఒకప్పుడు ఫ్యాషన్. పాతతరంలో డిగ్రీ చేయడం గొప్ప విషయం కాబట్టి దర్శకులు తమ క్వాలిఫికేషన్ పేరు వెనుక వేసుకుని ప్రౌడ్ గా ఫీలయ్యేవారు. అలా పేరుతో పాటు క్వాలిఫికేషన్ తో పాపులర్ అయిన దర్శకుల్లో రాఘవేంద్రరావు పేరు చెప్పుకోవాలి. ఆయన పేరు వెనుక ఎప్పుడూ ‘బి.ఎ’ అనే క్వాలిఫికేషన్ ఉండేది. అది ఇంటిపేరులా మారిపోయింది ఆయనకు. ఐతే తోటి దర్శకులు క్వాలిఫికేషన్ వేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపనపుడు రాఘవేంద్రరావు మాత్రం ఎందుకలా వేసుకున్నారు? ట్రెండు మారాక కూడా దాన్ని ఎందుకు కొనసాగించారు? ఈ ‘బి.ఎ’ వెనుక కథేంటి? దర్శకేంద్రుడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘నా తొలి సినిమాకు నిర్మాతే పట్టుబట్టి నా క్వాలిఫికేషన్ వేయించారు. ఆ తర్వాత అది అలవాటైంది. ఓ సినిమాకు పేరు వెనుక బి.ఎ లేకుండా వేశారు. ఆ సినిమా ఫ్లాపైంది. దీంతో ‘బి.ఎ’ అనేది సెంటిమెంటుగా మారిపోయింది. దీంతో మర్చిపోకండి.. బి.ఎ అని వేయండి అని నేనే చెప్పి మరీ వేయించుకునేవాణ్ని. ఐతే కాలం మారాక అలా క్వాలిఫికేషన్ వేసుకోవడం సిల్లీగా అనిపించింది. ఇప్పుడు తలుచుకుంటే నాకే సిగ్గుగా కూడా అనిపిస్తుంది. ఐతే నా పేరు వెనుక ‘బి.ఎ’ అనే అక్షరాలకు జనాలు వేరే అర్థాలు తీశారు. ‘బొడ్డు మీద యాపిల్’ అని కొత్త అర్థం తెచ్చారు. ఐతే కేవలం పాటల్ని చూసి అలా మాట్లాడితే మనసు చివుక్కుమంటుంది. జ్యోతి - దేవత - కల్ప - ఆమె కథ - బొబ్బిలి బ్రహ్మన్న - జస్టిస్ చౌదరి లాంటి కథాబలం ఉన్న సినిమాలు తీసిన సంగతి జనాలు మరిచిపోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు రాఘవేంద్రరావు.