Begin typing your search above and press return to search.
బాహుబలి 3 నేను డైరక్ట్ చేస్తా ప్లీజ్
By: Tupaki Desk | 26 March 2017 4:41 PM GMT''నువ్వు బాహుబలి 3 తీస్తే మాత్రం అందులో ఒక్క షాటైనా నాకు డైరక్ట్ చేసే అవకాశం ఇవ్వు ప్లీజ్'' అంటూ రాజమౌళిని ఎవరైనా అడిగే ధైర్యం చేస్తారా? కాని ఒక్కాయన మాత్రం.. నువ్వు తీసే తదుపరి బాహుబలిలో మాత్రం నాకు అవకాశం ఇవ్వాల్సిందే అంటున్నారు. అలా అంటోంది ఎవరో కాదు.. స్వయంగా రాజమౌళికి డైరక్షన్లో అక్షరాభ్యాసం చేసిన దర్శకేంద్రుడు.
బాహుబలి 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రాజమౌళిపై ప్రసంశల వర్షం కురిపించారు కె.రాఘవేంద్రరావు. ఈ సినిమాలోని ప్రతీ ఫ్రేమునూ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు రాజమౌళికి ఆయన కితాబులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''రాజమౌళి ఎంతో ఘనంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. నేను చెప్పేదేముంది. మీరే చూశారు. అయితే ఒక్కరోజు కూడా నేను షూటింగ్ కు వెళ్ళలేదు. ఆల్రెడీ అద్భుతంగా తీస్తున్నప్పుడు నేనెళ్ళి ఏం చేస్తాను? కాని రాజమౌళి బాహుబలి 3 తీస్తే మాత్రం.. నాకు అందులో ఒక్క షాట్ డైరక్షన్ చేసే అవకాశం ఇవ్వు ప్లీజ్'' అంటూ తన మనస్సులోని మాటలను బయటపెట్టేశారు. అసలు ఏ శిష్యుడునైనా ఒక గురువు అలా అడిగారంటే.. ఆ శిష్యుడు ఘనత.. ఆ గురువు గొప్పతనం.. నిజంగా గ్రేటే.
ఆ విధంగా తన స్పీచ్ ముగించుకుని రాఘవేంద్రరావు వెళుతుంటే.. 'మీ శిష్యుడు రాజమౌళి' అంటూ సుమా చెప్పబోయింది. మధ్యలో కట్ చేసిన రాఘవేంద్రరావు.. ''రాజమౌళే బాహుబలి.. నేను మనోడ్ని ఒక షాట్ తీస్తానని అడుగుతుంటే.. మళ్లీ నువ్వు మనోడ్ని నా శిష్యుడు అంటావేంటి అతన్ని'' అంటూ చురక అంటించారు రాఘవేంద్రరావు.