Begin typing your search above and press return to search.
అడవి రాముడు.. ఇప్పటి లెక్కల్లో 360 కోట్లు
By: Tupaki Desk | 18 Jan 2016 3:30 PM GMTతెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ ఏది అంటే.. మరో ఆలోచన లేకుండా ఠక్కున ‘బాహుబలి’ అని సమాధానం ఇచ్చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిందీ సినిమా. కేవలం తెలుగు వరకే రూ.250 కోట్ల దాకా వసూలైనట్లు అంచనా. కాబట్టి తెలుగు సినిమా చరిత్రలో ఇదే బిగ్గెస్ట్ హిట్ అని ఒప్పుకుని తీరాలి. కానీ రాఘవేంద్రరావు లెక్కల్లో చూస్తే మాత్రం ‘అడవి రాముడు’ సినిమానే బాహుబలి కన్నా పెద్ద హిట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా వసూళ్లు రూ.360 కోట్లు అంటున్నారాయన. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో భాగంగా ఆయనీ మాట చెప్పారు.
‘‘ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం.. జనాభా - జనరేషన్ - పెరిగిన డబ్బు విలువ ప్రకారం చూస్తే అడవి రాముడు రూ.360 కోట్ల వసూలు చేసినట్లు ఓ ఎక్స్ పర్ట్ చెప్పాడు. ఆ లెక్కన చూస్తే ఇప్పటిదాకా ఏ సినిమా కూడా దీన్ని బీట్ చేయలేదనే చెప్పాలి’’ అంటూ ‘బాహుబలి కంటే తన సినిమానే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పకనే చెప్పారు రాఘవేంద్రరావు. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ ను మించిన హీరో కూడా లేడని.. తన కెరీర్ నిలబడ్డానికి కూడా ఆయనే కారణమని.. ఆయన్ని తాను దేవుడిలా భావిస్తానని రాఘవేంద్రరావు అన్నారు. ‘‘నా కెరీర్ ఎన్టీఆర్ సినిమాతోనే మొదలైంది. పాండవ వనవాసం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా. దర్శకుడయ్యాక మూడేళ్లకే ఆయనతో పని చేసే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ చివరి సినిమా ‘మేజర్ చంద్రకాంత్’కు నేనే దర్శకత్వం వహించడం నా అదృష్టం. నేను ఆయనకు ఫెయిల్యూర్స్ ఇచ్చినపుడు కూడా ఆయన పల్లెత్తు మాట అనలేదు’’ అని రాఘవేంద్రరావు చెప్పారు.