Begin typing your search above and press return to search.
రాఘవేంద్రుడు మాట మార్చేశాడు..
By: Tupaki Desk | 7 Feb 2017 5:25 AM GMTమాట మార్చేశాడంటే.. నెగెటివ్ ఆలోచనలేమీ పెట్టుకోకండి. ఆయన ఒక పాజిటివ్ విషయంలోనే మాట మార్చాడు. తన అభిమానులకు ఆనందాన్నిచ్చే మాట చెప్పాడు. ‘ఓం నమో వెంకటేశాయ’నే తన చివరి సినిమా అంటూ ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా పలుమార్లు రాఘవేంద్రరావు అన్నట్లు అక్కినేని నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుకలోనూ అదే తరహాలో మాట్లాడాడు రాఘవేంద్రుడు. ఐతే ఇప్పుడు ఆయన ఆలోచన మారినట్లుంది. ‘ఓం నమో వెంకటేశాయ’నే తన చివరి సినిమా అని భావించట్లేదు అన్నాడు దర్శకేంద్రుడు.
‘ఓం నమో వెంకటేశాయ’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ నా జీవితమంతా ఆ దేవుడు చెప్పినట్లే జరుగుతూ వస్తోందదనుకుంటున్నా. ఈ రోజు నేను ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యానన్నా అంతా ఆ దేవుడి దయవల్లే. కాబట్టి నేను సినిమాలకు గుడ్ బై చెప్పడం కూడా నా చేతుల్లో లేదు. ‘ఓం నమో వెంకటేశాయ’ నా చివరి సినిమా అని నేను అనుకోవట్లేదు. ఆ దేవుడేమనుకుంటున్నాడో తెలియదు కదా’’ అంటూ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు రాఘవేంద్రుడు. ఇటీవలే యాదగిరి గుట్టను సందర్శించిన రాఘవేంద్రరావు.. అక్కడి లక్ష్మినరసింహస్వామి చరిత్ర మీద ఒక సినిమా తీయాలని అనుకుంటున్నట్లుగా చెప్పడం తెలిసిందే. ఆయన ఆ విషయంలో కొంచెం సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రిటైర్మెంట్ విషయంలో వెనక్కి తగ్గినట్లున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/