Begin typing your search above and press return to search.
ఏంటి ఈ రివ్యూలు.. ఈ సమయంలో కూడా మమ్ములను వదలరా
By: Tupaki Desk | 1 July 2020 2:00 PM GMTఇంతకు ముందు సినిమాలు విడుదల అయిన సమయంలో రివ్యూలు రాసేవారు. ఇప్పుడు థియేటర్లు లేకపోవడం తో అంతా కూడా డిజిటల్ రిలీజ్ కు వెళ్తున్నారు. ఓటిటి ద్వారా విడుదల అవుతున్న సినిమాలకు రివ్యూలు రాస్తున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 42 డేస్ సినిమా కు పలు వెబ్ సైట్స్ రివ్యూలు రాశాయి. కొన్ని సైట్లు సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేశారట. ఆ విషయంపై సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన రఘు కుంచె ఘాటుగా స్పందించారు.
మేము చాలా కష్టపడి సినిమాలు తీస్తాము. కొందరు బాల మేధావులు సినిమా బాగాలేదని రాస్తున్నారు. ఈ సినిమా ఓటిటి లో విడుదల అయ్యింది కనుక పర్వాలేదు. అదే థియేటర్ లో విడుదల అయ్యి ఉంటే చాలా నష్టం వచ్చేది అంటూ వ్యాఖ్యలు చేసాడు. సినిమాపై సాధారణ ప్రేక్షకులు చాలా పాజిటివ్ గా ఉన్నారు. సినిమాకు ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారు.
ప్రస్తుత సమయంలో అయినా సినిమా వారిని కాస్త ఇబ్బంది పెట్టకుంటే బాగుంటుందని రివ్యువర్స్ కు ఆయన సూచించారు. సినిమా గురించి మీరు ఎం రాసినా కూడా మేము అలా చూస్తూ ఉండాలా అంటూ ప్రశ్నించారు. సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభములో ఉన్న ఈ సమయంలో అయినా మీరు మనసు పెట్టి ఆలోచించండి అంటూ రివ్యువర్స్ కు రఘు కుంచె సూచించాడు.