Begin typing your search above and press return to search.
చిన్న మ్యూజిక్ డైరెక్టర్‌కు బంపరాఫర్
By: Tupaki Desk | 28 Jun 2015 7:43 AM GMTరఘు కుంచె టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముందు యాంకరింగ్‌తో పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పాటలు పాడి ఆశ్చర్యపరిచాడు. ఆపై సంగీత దర్శకుడి అవతారం కూడా ఎత్తాడు. బంపరాఫర్ సినిమాలో ఎందుకే రమణమ్మా అంటూ రఘు చేసిన హంగామాను ఎవ్వరూ మరిచిపోలేరు. పూరి జగన్నాథ్ లాంటి పెద్ద దర్శకుడి సినిమా 'దేవుడు చేసిన మనుషులు'కు పని చేసి మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఐతే ఆ సినిమా ఫ్లాపవడంతో రఘుకు పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత రెండు మూడు చిన్న చిత్రాలకు పని చేసిన రఘు.. తన టాలెంట్‌కు తగ్గ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఐతే తెలుగులో కాదు కానీ.. కన్నడ నుంచి రఘుకు ఓ బంపరాఫర్ వచ్చింది. శాండిల్‌వుడ్ స్టార్ హీరో దర్శన్ సినిమాకు సంగీతాన్నందించే ఛాన్స్ కొట్టేశాడు రఘు. దర్శన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఓ యువ దర్శకుడు రఘు టాలెంట్ ఏంటో తెలుసుకుని పిలిచి మరీ అవకాశమిచ్చాడట. కన్నడలో తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు రఘు. ఆ సినిమాలో స్వయంగా పాటలు కూడా పాడుతున్నాడు రఘు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి శాండిల్‌వుడ్‌కు వెళ్లిన ఆర్పీ పట్నాయక్ అక్కడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రఘుకు కూడా అలాంటి బ్రేక్ రావాలని ఆశిద్దాం.