Begin typing your search above and press return to search.

ప్ర‌ణ‌వి పెళ్లి పాట‌... పెళ్లి కొడుకు ఎవ‌రంటే?!

By:  Tupaki Desk   |   19 Nov 2015 6:29 AM GMT
ప్ర‌ణ‌వి పెళ్లి పాట‌... పెళ్లి కొడుకు ఎవ‌రంటే?!
X
టాలీవుడ్‌ లోని మ‌రో అంద‌మైన సింగ‌ర్... ప్ర‌ణ‌వి. ప‌లు చిత్రాల్లో పాట‌లు పాడి మంచి టాలెంటెడ్ సింగ‌ర్‌ గా పేరు తెచ్చుకొన్న ప్ర‌ణ‌వి పెళ్లి పాట పాడుతోంది. ఆమె త్వ‌ర‌లోనే ఓ పెళ్లి కూతురు కాబోతోంద‌న్న‌మాట‌. ఇంత‌కీ ప్ర‌ణ‌వి పెళ్లి చేసుకొనేది ఎవ‌ర్నో తెలుసా? డ్యాన్స్ మాస్ట‌ర్ ర‌ఘు. మంచి డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్ పేరు తెచ్చుకొన్న ర‌ఘు, గాయ‌ని ప్ర‌ణ‌వి కొంత‌కాలంగా ప్రేమించుకొంటున్నార‌ట‌. ఫిబ్ర‌వ‌రిలో ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ విష‌యం అబ్బాయితో అమ్మాయి ఆడియో ఫంక్ష‌న్‌ లో బ‌య‌టికొచ్చింది. యాంక‌ర్ ఝాన్సీ బ‌య‌ట పెట్టారు. వీళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని చెప్ప‌గానే అక్క‌డే ఉన్న ర‌ఘు - ప్ర‌ణ‌వి సిగ్గుల‌మొగ్గ‌లైపోయారు.

ర‌ఘు మాస్ట‌ర్ మిర్చిలో ఇదేదో బాగుందే చెలి... అన్న పాట‌కి డ్యాన్స్ కంపోజ్ చేసి చాలా పేరు తెచ్చుకొన్నాడు. ఈటీవీలో ఇదివ‌ర‌కు జ‌రిగిన రియాలిటీ షో ఢీలో కూడా పాల్గొని త‌న టాలెంట్‌ ని నిరూపించుకొన్నాడు. ర‌ఘులో ఎంత మంచి కొర్రియోగ్రాఫ‌రో ఆయ‌న‌లో అంత మంచి ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడు. త్వ‌ర‌లోనే త‌న డైరెక్ష‌న్ టాలెంట్‌ ని నిరూపించుకొనేందుకు మెగాఫోన్ కూడా చేత‌ప‌ట్ట‌బోతున్నారు. అందులో ఆయ‌నే హీరోగా న‌టించే అవ‌కాశాలున్నట్టు తెలుస్తోంది. ప్ర‌ణ‌వి కూడా బోలెడ‌న్ని పాట‌లు పాడి పేరు తెచ్చుకొంది. సంగీతం కూడా నేర్చుకొన్న ఆమె భ‌విష్య‌త్తులో మ్యూజిక్ డైరెక్ష‌న్‌ వైపు వెళ్లే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఇద్ద‌రు మంచి టాలెంటెడ్ టెక్నీషియ‌న్లు ఒక్క‌ట‌వుతున్నార‌న్న‌మాట‌.