Begin typing your search above and press return to search.

ఐసీయూలో నాని హీరోయిన్‌

By:  Tupaki Desk   |   24 Aug 2015 6:58 AM GMT
ఐసీయూలో నాని హీరోయిన్‌
X
సినిమా షూటింగ్‌ లో జ‌రిగిన ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన ప్ర‌ముఖ క‌న్న‌డ హీరోయిన్ రాగిణి ద్వివేది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నానే నెక్స్ట్ సీఎం (త‌దుప‌రి ముఖ్య‌మంత్రి నేనే) అనే సినిమా షూటింగ్‌ లో భాగంగా ఆదివారం మైసూర్‌ లో కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. మూడు గంట‌ల స‌మ‌యంలో ఓ ఫైట్ సీన్‌ లో భాగంగా ఫైట‌ర్ విసిరిన హాకీ స్టిక్‌ ను త‌ప్పించుకునే క్ర‌మంలో అది నేరుగా వ‌చ్చి ఆమె త‌ల‌కు త‌గిలింది.

వెంట‌నే కింద‌ప‌డిపోయిన రాగిణికి తీవ్ర ర‌క్త‌స్రావ‌మైంది. దీంతో హుటా హుటీన చిత్ర యూనిట్ స‌భ్యులు ఆమెను స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి మెరుగ్గానే ఉన్న‌ట్టు వైద్యులు చెపుతున్నారు. ప్రీమియ‌ర్ స్టూడియోస్ బ్యాన‌ర్‌ పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

రాగిణి తెలుగులో నాని హీరోగా వ‌చ్చిన జెండాపై క‌పిరాజు సినిమాలో ఓ హీరోయిన్‌ గా న‌టించింది. ఆమె టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా తో క్లోజ్‌ గా మూవ్ అయ్యి కూడా వార్త‌ల్లో కెక్కింది.