Begin typing your search above and press return to search.
రెహ్మాన్ రాగంకు 25 ఏళ్ళు
By: Tupaki Desk | 12 July 2017 4:08 AM GMTఇండియన్ ఫిల్మ్ హిస్టరి లో కొన్ని పేర్లు సినిమా చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోతాయి. అలాగే కొంతమంది సంగీతం ఉన్నంత వరకు వాళ్ళ సంగీతం ఎన్ని తరాలు గడిచినా ఇంకా నెమ్మదిగా సాగే జీవనదిలా ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక ప్రేమికుడు విరహ వేదన చెప్పాలన్నా.. దేశం కోసం ఒక పౌరుడు భక్తిని చాటి చెప్పాలన్నా.. అమ్మ ప్రేమను పలికించాలన్నా.. ప్రకృతిని చూసి పరవశించి పాట పాడుకోవాలిన్నా.. తన అద్భుత రాగాలతో భావాలును గొప్పగా పలికించగలిగే ఒక మెజీషియన్.. ఏ.ఆర్.రెహ్మాన్. ఇప్పుడు ఈయన ఇండస్ట్రికి వచ్చి 25 ఏళ్ళు నిండాయి. ప్రేమ - ప్రేరణ - ఆశయ పోరాటం - పోటీ - పరువం - బాధ - బంధం - స్నేహం - దేశం - ఆనందం భావం ఏదైనా తెర పై ఎవరున్నా కూడా శబ్ధతరంగంతో శ్రోతలను తన మ్యూజిక్ తో మాయ చేస్తాడు.
ఇంటర్నేషనల్ స్థాయిలో ఇండియన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అది కేవలం ఏ ఆర్ రెహ్మాన్ మూలంగానే. ఆస్కార్ - గ్రామ్మీ - గోల్డెన్ గ్లోబ్ - బాఫ్టా(BAFTA) ఇలా చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న రెహ్మాన్ ఇప్పుడు టాలీవుడ్ - బాలీవుడ్ - కోలివుడ్ - హాలీవుడ్ ఇలా భాష బేధం లేకుండా అన్ని రకాల ప్రేక్షకులను తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు. మొన్న జరిగిన సైమా అవార్డ్ ఫంక్షన్లో కూడా రహ్మన్ సంగీతం అందించిన 'సాహసం శ్వాసగా సాగిపో' తమిళ వర్షన్ కు అవార్డ్ వచ్చింది. జూలై 14 న న్యూ యార్క్ లో జరగబోయే IIFA అవార్డ్ ఫంక్షన్ లో తను 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు గంటలు సంగీత సమ్మేళనం ఒకటి జరగబోతుంది.
“సంగీతమే నాకు జీవం - అదే నా జీవితం. మనిషిని అర్ధం చేసుకుంటే రాగాలు తొందరగా అర్ధం అవుతాయి. మానవత్వాన్ని సంగీతాన్ని నేను వేరు చేయలేను'' అని చెబుతున్నాడు రెహ్మాన్. రోజా - బొంబాయ్ - గురు - యువ - లగాన్ - స్వదేశ్ - ఓకే బంగారం - బొయ్స్ లాంటి మ్యూజిక్ తో పాటు మా తుఝే సలామ్ - ప్రే ఫర్ మీ బ్రదర్ - వన్ లవ్ లాంటి మ్యూజిక్ వీడియోలు కూడా కంపోజ్ చేశాడు. స్లమ్ డాగ్ మిలియనైర్ తో ప్రపంచ స్థాయి మ్యూజిక్ కంపోజర్ గా ఎదిగాడు. ఇప్పుడు మీరు రానున్న కెరియర్ ని ఎలా మలుచుకోబోతున్నారు అనే ప్రశ్నకు “నేను ఇప్పుడు రానున్న టైమ్ ని మరింత గొప్పగా వినియోగించాలిని అనుకుంటున్నాను. ఆర్ధికంగా వెనకబడ్డ పిల్లలు కోసం నేను ఒక స్కూల్ కూడా నడుపుతున్నాను. వాళ్ళు త్వరలో కంపోజర్లలా కూడా కావచ్చు. “డాటర్స్ ఆఫ్ డేస్టీని” అనే ఒక టివి ఎపిసోడ్ కూడా చేస్తున్నాం హాలీవుడ్ డైరెక్టర్ వనేస్సా రోత్ కోసం. నేను ఇప్పుడు మార్గదర్శకుడు గా ఇంకా కంపోజర్ గా ఇలాగే కొనసాగాలి అనుకుంటున్న'' అని చెప్పాడు.