Begin typing your search above and press return to search.
ఆ అరుదైన గౌరవాన్ని మరోసారి సొంతం చేసుకున్న రెహమాన్
By: Tupaki Desk | 30 Jun 2021 2:30 PM GMTఎంత పెద్ద కళాకారుడైనప్పటికీ.. తీవ్రమైన భావోద్వేగంతో పని చేసిన సందర్భాల్లో వాటికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంటుంది. తన సంగీతంతో సరిహద్దులకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్. ఎన్నో సూపర్ హిట్ గీతాల్ని అందించిన ఆయనకు అవార్డులు.. సంగీత అభిమానుల రివార్డులు కొత్తేం కాదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆయన ట్యూన్ చేసిన పాటకు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే ఆ పాటకు నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు.
కరోనా వేళ మనుషుల్లో తగ్గుతున్న స్థైర్యాన్ని పెంపొందించేలా ఈ పాటను కంపోజ్ చేశారు ఎఆర్ రెహమాన్. ఈ పాటను అస్కార్ విజేత గుల్జార్ రాశారు. ‘మేరీ పుకార్ సునో’ పేరుతో కంపోజ్ చేసిన ఈ పాట ప్రత్యేకత ఏమంటే.. దీన్ని ఆరుగురు గాయనీమణులే పాడారు. ప్రజలంతా ధైర్యాన్ని కోల్పోయిన వేళ.. వారిలో జారిపోయిన స్థైర్యాన్ని పెంచేందుకు తోడ్పాటు అందించేలా ఈ పాట ఉందని చెప్పాలి.
‘ఇప్పటివరకు చాలా విన్నారు. ఈ ఒక్కసారి నా పిలుపు వినండి. భూమాత పిలుస్తోంది. ఈ జగతి ఆశతో నిండి ఉంది. హాయిగా ఊపిరి పీల్చుకోండి. స్వస్థత చెందండి. వారందరిని తిరిగి మామూలుగా చేయటానికి అమ్మే పూనుకోవాలి’’ అన్న అర్థం వచ్చేలా దీన్ని రాశారు. ఒకవిధంగా చెప్పాలంటే.. భూమాత తన పిల్లలకు ధైర్యం చెప్పినట్లుగా దీన్ని రాశారు. ఇటీవల కాలంలో ఈ పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. ఈ గీతాన్ని మాతృభూమికి అంకితమిస్తూ నిర్ణయం తీసుకున్నారు రెమమాన్.
ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. ఈ పాటకు ఉత్తరాది.. దక్షిణాది గాయనీ గాయకులైన చిత్ర.. శ్రేయాఘోషాల్.. అల్కా యాగ్నిక్.. సాధనా సర్గమ్.. షాషా తిరుపతి.. అర్మన్ మాలిక్.. ఆషిఫ్ కౌర్ ఆలపించారు. ఇప్పటికే ఈ పాటకు యూ ట్యూబ్ లో కోటిన్నరకు పైనే వ్యూస్ వచ్చాయి. అంతేకాదు.. ఈ పాటకు అమెరికాలో మరో అరుదైన గౌరవం సొంతమైంది. లాస్ ఏంజెల్స్.. న్యూయార్క్ సిటీలోఈ పాటను బిల్ బోర్డులో డిస్ ప్లే చేశారు. గతంలోనూ రెహమాన్ కంపోజ్ చేసిన ఒక పాటను ఇదే రీతిలో బిల్ బోర్డులో డిస్ ప్లే చేశారు. మరోసారి.. ఈ అరుదైన గౌరవం రెహమాన్ పాటకు దక్కింది. భారతీయులుగా మనమంతా సంతోషించి.. గర్వంగా ఫీల్ కావాల్సిందే.