Begin typing your search above and press return to search.

పెద్ద తెర‌పై రాహుల్-చిన్మ‌యి ప్రేమ‌క‌థ‌..?

By:  Tupaki Desk   |   24 Aug 2021 2:30 PM GMT
పెద్ద తెర‌పై రాహుల్-చిన్మ‌యి ప్రేమ‌క‌థ‌..?
X
అఖిల్ అక్కినేని క‌థానాయ‌కుడిగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కిస్తున్న‌ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీలో రిలీజ‌వుతుంద‌ని ప్ర‌చారం సాగినా.. థియేట్రికల్ రిలీజ్ కోసం నిర్మాత‌లు వేచి చూస్తున్నారు. దసరా బ‌రి నుంచి ఆర్.ఆర్.ఆర్ వైదొలిగింద‌న్న వార్త‌ల న‌డుమ ఈ సినిమాని అక్టోబర్ 12 న థియేటర్లలో విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో నిజ జీవిత ప్రేమ‌జంట‌ల‌ను భాస్క‌ర్ తెర‌పై చూపించ‌నున్నార‌ని తెలిసింది. ఇందులో నిజ జీవిత ల‌వ్ క‌పుల్ చిన్మయి- ‍ రాహుల్ రవీంద్రన్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఆ ఇద్ద‌రూ సినిమాలో కలిసి నటించడం ఇదే మొదటిసారి. దీంతో అభిమానుల్లో అంతో ఇంతో క్యూరియాసిటీ ఈ జంట‌పై ఉంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. GA2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.

గాయ‌ని డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి గ‌త కొన్నేళ్లుగా ర‌క‌ర‌కాల వివాదాల‌తో హెడ్ లైన్స్ లో నిలిచారు. ఇంత‌కుముందు ప్ర‌ముఖ త‌మిళ‌ లిరిసిస్ట్ వైర‌ముత్తు త‌న‌పై వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని మీటూ వేదిక‌గా ఆరోపించారు. ఆ స‌మ‌యంలో త‌న భ‌ర్త‌ రాహుల్ ర‌వీంద్ర‌న్ చిన్మ‌యికి అండ‌గా నిలిచారు. క‌ష్టం సుఖం ఇబ్బందుల్లోనూ ఈ జంట ఆదర్శ జీవ‌నం అభిమానుల హృద‌యాల్ని తాకింది. క‌ఠిన స‌మ‌యాల్లో స్నేహితురాలు స‌మంత నుంచి చిన్మ‌యికి మోర‌ల్ సపోర్ట్ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. అఖిల్.. స‌మంత‌.. చైత‌న్య‌ల‌కు చిన్మ‌యి ఎంతో స‌న్నిహితులు అన్న సంగ‌తి కూడా తెలిసిన‌దే. ఇటీవ‌ల చిన్మ‌యి గాయ‌నిగా బిజీ అవుతోంది. త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా త‌న‌కు తెలుగు చిత్ర‌సీమ‌లో అవ‌కాశాల‌కు కొద‌వేమీ లేదు.