Begin typing your search above and press return to search.
వివాదాలతో ఎంత వరకు సినిమా హిట్ అయ్యేను రాహుల్?
By: Tupaki Desk | 5 Sep 2021 2:30 PM GMTసినిమాను తీయడం కష్టం కాదు కాని ఆ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడం చాలా పెద్ద టాస్క్ గా మారింది. మంచి సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయకుంటే ప్లాప్ అయిన సందర్బాలు ఉన్నాయి. సినిమా బాగాలేకున్నా కూడా వచ్చిన పబ్లిసిటీ మరియు చేసిన ప్రమోషన్స్ వల్ల బాగా లాభాలు వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే ఈమద్య చిన్న సినిమాలకు కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే రాహుల్ రామకృష్ణ నటించిన 'నెట్' అనే సినిమాకు కూడా విభిన్నతరహాలో ప్రమోషన్స్ చేస్తున్నాడు. సాదా సీదాగా ప్రమోషన్స్ చేస్తే జనాలు పట్టించుకునే రోజులు కావు ఇవి.. అందుకే వర్మ తరహాలో అంతా ఆలోచిస్తున్నారు.
పాజిటివ్ లేదా నెగటివ్ ఏదో ఒక విధంగా జనాలు మాట్లాడుకునేలా చేయాలనే ఉద్దేశ్యంతో మా సినిమా గు.. లో దమ్ముంది అంటూ రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను కొందరు విమర్శిస్తే చూస్తూ ఊరుకోకుండా దాన్ని మరింతగా పెంచే విధంగా ఇక్కడ ఎంత మంది పతిత్తులు ఉన్నారు అంటూ మరింత కాక రేపాడు. సోషల్ మీడియాలో ఆయన తీరును కొందరు తప్పుబడుతుంటే కొందరు మాత్రం సినిమా ప్రమోషన్ కోసం తప్పదు కదా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.
నెట్ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్దం అయ్యింది. సినిమా షూటింగ్ సమయంలో జనాలకు పెద్దగా తెలియదు. కాని ఎప్పుడైతే తన సినిమాకు దమ్ముంది అంటూ ఇతర సినిమాలను తక్కువ చేసినట్లుగా మాట్లాడాడో అప్పటి నుండి నెట్ గురించి చర్చ మొదలు అయ్యింది. తాజాగా నాని అంటే ఇష్టం అంటూనే అదే రోజున విడుదల కాబోతున్న టక్ జగదీష్ కంటే తన నెట్ బాగుంటుంది అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేయడం కూడా మరింతగా సినిమా పైకి దృష్టి మరల్చేలా చేసింది.
మొత్తానికి సినిమా పై అంచనాలు పెంచుతూనే ఉన్నాడు. వివాదాలతో.. బ్యాడ్ కామెంట్స్ తో వచ్చే పబ్లిసిటీ బాగానే ఉంది కాని దాంతో సినిమా హిట్ అయ్యేనా రాహుల్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సినిమా కు వచ్చిన పబ్లిసిటీ వల్ల మరింతగా బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం.