Begin typing your search above and press return to search.

ఇది న్యాయం కాదంటున్న రాహుల్ రామకృష్ణ

By:  Tupaki Desk   |   7 Dec 2019 7:53 AM GMT
ఇది న్యాయం కాదంటున్న రాహుల్ రామకృష్ణ
X
ఒక అంశంపై అందరి స్పందన ఒకే రకంగా ఉండదు. భిన్నమైన అభిప్రాయాలు చాలా సహజం. వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం.. హత్య సంఘటన దేశాన్ని కుదిపేసింది. తదనంతర పరిణామాలు.. క్రైమ్ సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా నలుగురు నిందితులను తీసుకుపోవడం.. అక్కడ జరిగిన పరిణామాలు.. ఎన్ కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దేశంలో మెజారిటీ ప్రజలు ఈ ఎన్ కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఓపెన్ గానే ఎన్ కౌంటర్ కు తమ మద్దతు తెలిపారు. అయితే కొందరు మాత్రం ఇది సరి కాదని అంటున్నారు.

టాలీవుడ్ యాక్టర్ కం కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ అంశంపై తన అభిప్రాయాలను మొహమాటం లేకుండా వెల్లడించారు. రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్లు ఒక్కసారి పరిశీలించండి.

*ఇది న్యాయం కాదు. ఊహకు అందని ప్రజల కోపాన్ని చల్లార్చేందుకు ఒక సేఫ్టీ వాల్వ్ ను పెట్టారు. అసలు నేరం జరగకుండా చట్టాలను అమలు చేసినప్పుడే నిజమైన న్యాయం జరిగినట్టు.

*చట్టాలపై పోలీసు వ్యవస్థకు ఎంత గౌరవం ఉందో తెలుసుకోవడానికి ఇది సరైన సమయం. భారతీయుల దృష్టిలో రాజ్యాంగానికి ఎంత తక్కువ విలువ ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు"

*ఇగ నుండి కోర్టులూ.. లాయర్లూ పని మానేసుకోవచ్చేమో.. చట్టం పీస్ఫుల్ గా పండుకోవచ్చు! నేరాలకి ఫుల్ స్టాప్ కలిగిచ్చేశిర్రు. మహిళలకు అంతులేని స్వేచ్ఛ గారెంటీ.