Begin typing your search above and press return to search.

బ్రిడ్జి మీద వాటే రొమాంటిక్ టచ్

By:  Tupaki Desk   |   31 Jan 2018 12:24 PM GMT
బ్రిడ్జి మీద వాటే రొమాంటిక్ టచ్
X
రొమాన్స్ కి అసలైన అర్ధం ఇదేనంటూ మన తెలుగు సినీ తారలు ఈ మధ్య చేస్తోన్న ప్రయోగాలను చూస్తుంటే అందరు షాక్ అవుతున్నారు. మనకంటే మార్కెట్ తక్కువ ఉన్న మలయాళం సినిమాల్లో రొమాన్స్ రేంజ్ ఏ తరహాలో ఉంటుందో ఆ సినిమాలను చూస్తే అర్ధమవుతుంది. కానీ ప్రస్తుతం టాలీవుడ్ అని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అంటే ఇంకా అసలైన శృంగారం టచ్ ఇంకా రాలేదని కొంతమంది ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

కానీ ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ డోస్ పెంచేస్తుండడం నార్మల్ గా లేదు. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అనేలా విమర్శకులు షాక్ అవుతున్నారు. ఇక సదరు ఫార్ములాను లైట్ గా టచ్ చేద్దామని అనుకుంటున్నారో ఏమో గాని రీసెంట్ గా ఇద్దరు తారలు టచ్ అయినా విధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే. రాహుల్ రవీంద్రన్ - చాందిని చౌదరి.. ఒక పోస్టర్లో చాలా ఘాటుగా హాగ్ చేసుకున్న తీరు కుర్ర కారును తెగ ఆకట్టుకుంటోంది.

హౌరా బ్రిడ్జ్ అనే సినిమాలోని ఈ స్టిల్ ప్రస్తుతం నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. వాటే.. టచ్ అంటూ మరికొంత మంది సంబోధిస్తుండడం చూస్తుంటే ఆ టచ్ కరెక్ట్ గా వర్కౌట్ అయ్యిందనిపిస్తోంది. ఇప్పటివరకు సినిమాకు సంబందించిన టీజర్ లుక్స్ ఎన్ని రిలీజ్ చేసినా క్రేజ్ రాని ఆ సినిమాకు ఈ టచ్ తో గట్టిగా ప్రమోషన్ జరుగుతోంది. ఫిబ్రవరి 3న రిలీజయ్యే ఈ సినిమాతో.. గతంలో 'బూచమ్మ బూచోడు' సినిమాను తీసిన దర్శకుడు రేవాన్ యాదు పెద్ద హిట్టు కొట్టాలనే చూస్తున్నాడు