Begin typing your search above and press return to search.

'అందాల రాక్ష‌సి' తో ప్రేయ‌సి దొరికింద‌ట‌!

By:  Tupaki Desk   |   26 Aug 2018 1:30 AM GMT
అందాల రాక్ష‌సి తో ప్రేయ‌సి దొరికింద‌ట‌!
X
`అందాల రాక్ష‌సి`తో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన రాహుల్ ర‌వీంద్ర‌న్....తాజాగా `చిల‌సౌ`తో త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు. ఇక‌, రాహుల్ భార్య చిన్మ‌యి....డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్ గా టాలీవుడ్ కు సుప‌రిచితురాలే. అయితే, ఈ ఇద్ద‌రి ల‌వ్ స్టోరీ ఏంటి....ఎలా క‌లిశారు అన్న అంశాల మీద జ‌న‌ర‌ల్ గా చాలామందికి క్యూరియాసిటీ ఉంది. ఆనోటా ఈ నోటా కాకుండా....రాహుల్ స్వ‌యంగా త‌మ ల‌వ్ స్టోరీని ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేశాడు. అందాల రాక్షసి లో లావ‌ణ్య‌కు చిన్మయి డబ్బింగ్ చెప్పింద‌ని - ఆ సినిమా స్క్రీనింగ్ టైంలో ఆమెతో తొలి పరిచయం అయింద‌ని రాహుల్ అన్నాడు. త‌మ ఇద్ద‌రికీ పాలిటిక్స్ - ఎకనామిక్స్ - సైన్స్ - మైథాలజీ.. అంటే ఇష్ట‌మ‌ని, అలా త‌న‌తో స్నేహం పెరిగి గంటల కొద్దీ డిస్క‌ష‌న్లు పెట్టుకునేవార‌మ‌ని చెప్పాడు.

త‌ను అంద‌రితో చాలా స్నేహంగా మాట్లాడుతుంద‌ని, అది త‌న‌కు చాలా నచ్చింద‌ని చెప్పాడు. తనకో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని, ఇండిపెండెంట్ గా ఆలోచిస్తుంద‌ని, మానసిక బలం, సామాజిక అవగాహన ఉన్నాయ‌ని అన్నాడు. తాను కోరుకున్న లక్షణాలన్నీ ఉండటంతోనే చిన్మ‌యిని ప్రేమించాన‌ని, తానే ఫ‌స్ట్ ప్రపోజ్ చేశానని అన్నాడు. త‌ను ఓకే చెప్పిన రెండేళ్లకు పెళ్లి చేసుకున్నామ‌ని, ఇపుడు హ్యాపీగా ఉన్నామ‌ని అన్నాడు.

నటుడిగా తెలుగులో ఎనిమిది - తమిళంలో మూడు చిత్రాలు చేశాన‌ని, కానీ ‘అందాల రాక్షసి’ హీరోగానే పాపుల‌ర్ అని అన్నాడు. న‌టిస్తూనే ద‌ర్శ‌క‌త్వం చేస్తాన‌ని అన్నాడు. ‘మాస్కోవిన్‌ కావేరీ’ అనే తమిళ చిత్రంలో సమంత, నేను తొలిసారి నటించామ‌ని, అప్ప‌టినుంచి ఆమె త‌న‌ స్నేహితురాల‌ని చెప్పాడు.