Begin typing your search above and press return to search.
`సూపర్ ఉమెన్` అంటూ సామ్ కి అండగా..!
By: Tupaki Desk | 26 Dec 2022 2:15 PM GMTలైఫ్ ప్రతి ఒక్కరికీ పాఠాలు నేర్పిస్తుంది. కొందరికి ముందుగా మరికొందరికి ఆలస్యంగా ఏదో ఒక రకంగా పాఠం నేర్చుకుని తీరాల్సిందే! తన కెరీర్ లైఫ్ జర్నీలో ఎన్నిటినో దాటుకుని ఇంకా ధృఢంగా ముందుకు సాగుతోంది సమంత రూత్ ప్రభు. తన మనోబలాన్ని చూశాక తన సహచరులు సూపర్ ఉమెన్ అని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా సమంత స్నేహితురాలు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్.. సామ్ కి బాసటగా నిలిచారు.
మయోసైటిస్ నుంచి సమంత పూర్తిగా కోలుకుందా లేదా? అన్నది ఇప్పటికీ సస్పెన్స్. యశోద విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా మైయోసైటిస్ తో బాధపడుతున్నట్లు వెల్లడించినప్పటి నుండి తన కంబ్యాక్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సామ్ ఆరోగ్యం గురించి రకరకాల గాసిప్ లు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. డిసెంబర్ రెండో వారం నుంచి సమంత విజయ్ దేవరకొండ `ఖుషి` సెట్స్ లో జాయిన్ అవుతారని వార్తలు వచ్చినా ఇప్పటివరకూ దానికి సంబంధించిన అప్ డేట్ లేదు.
మరోవైపు వరుణ్ ధావన్ తో వెబ్ సిరీస్ నుంచి సమంత వైదొలిగిందని కథనాలు రావడంతో సందేహాలు అలుముకున్నాయి. కానీ సమంత త్వరలో అన్ని సందేహాలకు చెక్ పెట్టనుందని అధికారికంగా ఒక ప్రకటన చేస్తుందని ఆమె బృందం స్పష్టం చేసింది. ఆ తర్వాత సమంత మళ్లీ ఆసుపత్రిలో కనిపించిందనే ప్రచారాన్ని కూడా ఆమె బృందం ఖండించినట్టు కథనాలొచ్చాయి.
దర్శకనటుడు రాహుల్ రవీంద్రన్ తాజాగా ఒక పిక్చర్ ఫ్రేమ్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. `సూపర్ మ్యాన్` లోగోతో `సామీ` అని వ్యాఖ్యను జోడించాడు. ఉమెన్ ఆఫ్ స్టీల్ అనే ట్యాగ్ లైన్ తో.. సామ్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసినందున అభిమానులు ఆమెను `సూపర్ ఉమెన్ సామీ` అని అభిమానంగా పిలుస్తున్నారు. కానీ ఆరోగ్యం పరంగా కఠిన సమయాన్ని నెట్టుకొస్తున్న సామ్ పూర్తి గా కోలుకుని ఇకనైనా సెట్స్ కి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇంతలోనే `పోరాడుతూనే ఉండాలి... మేం గతంలో కంటే బలంగా ఉంటాం... త్వరలో ఎప్పటికీ బలంగా ఉంటాం.. `` అని ఆ ఫోటోని షేర్ చేస్తూ సమంత రాసింది. దీనిని బట్టి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఈ వ్యాఖ్య బలపరుస్తోంది. ఈ వ్యాఖ్య మరోసారి అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. సామ్ నుంచి అధికారికంగా ఏదైనా ప్రకటన వచ్చేవరకూ ఈ కన్ఫ్యూజన్ ఇలానే కొనసాగుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.