Begin typing your search above and press return to search.
నటనకు స్వస్తి చెప్పేసినట్లేనా?
By: Tupaki Desk | 7 July 2018 8:26 AM GMTనటులు దర్శకులుగా మారడం.. దర్శకులు నటులుగా మారడం మామూలే. ఐతే నటులు దర్శకులుగా మారడం చాలా లేటుగా జరుగుతుంటుంది. చాలా ఎక్కువ సినిమాలు చేసి బాగా అనుభవం సంపాదించాక మెగా ఫోన్ పడుతుంటారు. కానీ యువ కథానాయకుడు రాహుల్ రవీంద్రన్ మాత్రం చాలా వేగంగానే దర్శకుడిగా మారాడు. హీరోగా పట్టుమని పది సినిమాలు కూడా చేయకుండానే మెగా ఫోన్ పట్టేశాడు. అక్కినేని కుటుంబ కథానాయకుడు సుశాంత్ ను పెట్టి ‘చి ల సౌ’ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఇంకా విడుదలే కాలేదు.. అప్పుడే అతడికి దర్శకుడిగా రెండో అవకాశం రావడం విశేషం. అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థలో కావడం మరింత పెద్ద విశేషం.
కొన్ని నెలలుగా వార్తల్లో లేకుండా పోయిన ‘చి ల సౌ’ను అన్నపూర్ణ సంస్థ తమ చేతుల్లోకి తీసుకుని సొంతంగా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చింది. ఇటీవలే నాగార్జున అండ్ కో ఈ సినిమా చూశారట. ఇంప్రెస్ అయ్యారట. అప్పుడే రాహుల్ టాలెంట్ ఏంటో నాగార్జునకు కూడా అర్థమైందట. తొలి సినిమాను బాగా డీల్ చేయడంతో అతడిని తమ సంస్థతో కమిట్ చేయించేశాడు. ఒక కొత్త దర్శకుడు టాలెంట్ చూపిస్తే వెంటనే కర్చీఫ్ వేయడం నాగార్జునకు అలవాటే. సుధీర్ వర్మ.. చందూ ముండేటి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లను ఇంతకుముందు చైతూ కోసం ఇలాగే కమిట్ చేయించాడు. ఇప్పుడు రాహుల్ ను అట్టిపెట్టాడు మరి అతను ఎవరితో సినిమా చేస్తాడన్నది చూడాలి. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత ‘అలా ఎలా’ లాంటి హిట్ మూవీలో నటించిన రాహుల్ కు.. ఆ తర్వాత కాలం కలిసి రాలేదు. వరుస ఫ్లాపులతో నటుడిగా బాగా వెనుకబడిపోయాడు. ఇక హీరోగా అతడి కెరీర్ ఊపందుకునే అవకాశాలేమీ కనిపించడం లేదు. అందుకే తనకు ఆసక్తి ఉన్న దర్శకత్వంపై దృష్టిపెట్టాడు. అన్నపూర్ణ లాంటి పెద్ద సంస్థలో అవకాశం దక్కించుకున్నాడంటే ఇక పూర్తిగా డైరెక్షన్ కే పరిమితం అయిపోయి నటనకు టాటా చెప్పేస్తాడన్నమాట.