Begin typing your search above and press return to search.
హీరో గారు 40 రోజుల్లో సినిమా తీసేశారు
By: Tupaki Desk | 17 Dec 2017 5:38 PM GMTఈ మధ్య నటుల్లోంచి కూడా దర్శకులు బయటికి వస్తున్నారు. అవసరాల శ్రీనివాస్ ఇప్పటికే ‘ఊహలు గుసగుసలాడే’.. ‘జ్యో అచ్యుతానంద’ లాంటి రెండు మంచి సినిమాలతో దర్శకుడిగా రుజువు చేసుకున్నాడు. మరోవైపు తమిళ స్టార్ హీరో ధనుష్ సైతం దర్శకుడిగా మారి ‘పవర్ పాండి’ లాంచి మంచి సినిమాతో మెప్పించాడు. ఇప్పుడు దక్షిణాదిన మరో యువ నటుడు మెగా ఫోన్ పట్టేశాడు. ‘అందాల రాక్షసి’.. ‘అలా ఎలా’ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్.. నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా గత నెలలో ‘చి ల సౌ’ అనే సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం నవంబరు 6న మొదలైతే.. డిసెంబరు 16 కల్లా.. అంటే 40 రోజుల్లోనే టాకీ పార్ట్ పూర్తి చేసుకోవడం విశేషం. శనివారం టాకీ పార్ట్ కానిచ్చేసి.. ఆదివారం పాటల చిత్రీకరణ కూడా మొదలుపెట్టేశారు. దర్శకుడిగా తొలి సినిమానే రాహుల్ ఇంత వేగంగా పూర్తి చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ స్పీడు మంచిదే కానీ.. సినిమాలో కంటెంట్.. క్వాలిటీ కూడా ఉండటం కీలకం. ‘కాళిదాసు’తో మొదలుపెట్టి ‘ఆటాడుకుందాం రా’ వరకు ఇప్పటిదాకా సుశాంత్ చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే. కొంచెం గ్యాప్ తీసుకుని అతను ‘చి ల సౌ’ చేశాడు. దీనిపై అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు. నటుడిగా కెరీర్ కొంచెం అటు ఇటుగా ఉన్న నేపథ్యంలో రాహుల్ కు కూడా ఈ సినిమా కీలకమైందే. మరి వీళ్లిద్దరికీ ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూడాలి.