Begin typing your search above and press return to search.

అక్కినేని మల్టీస్టార‌ర్ షాకిచ్చే నిజం

By:  Tupaki Desk   |   27 July 2019 5:15 AM GMT
అక్కినేని మల్టీస్టార‌ర్ షాకిచ్చే నిజం
X
అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ `మ‌నం` ఎంత పెద్ద స‌క్సెసైందో తెలిసిందే. అక్కినేని హీరోలంతా క‌లిసి న‌టించిన ఈ సినిమా తెలుగు సినిమా హిస్ట‌రీలో ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఏఎన్నార్ న‌టించిన చిట్ట‌చివ‌రి చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్.కె.కుమార్ కి గొప్ప పేరు గుర్తింపు తెచ్చింది ఈ చిత్రం. ఆ త‌ర్వాత మ‌నం సీక్వెల్ వ‌స్తుంద‌ని ప్ర‌చార‌మైనా ఇప్ప‌టివ‌ర‌కూ దాని జాడే లేదు. అయితే ఈలోగానే అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ కి `మ‌న్మ‌ధుడు2` ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కి నాగార్జున గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

నాగ‌చైత‌న్య‌- అఖిల్ హీరోలుగా ఓ మ‌ల్టీస్టార‌ర్ ని ప్లాన్ చేయ‌మ‌ని రాహుల్ ర‌వీంద్ర‌న్ కి నాగార్జున ఆఫ‌ర్ ఇచ్చార‌ని `మ‌న్మ‌ధుడు 2` రిలీజ‌వ్వ‌గానే అత‌డు ఆ ప‌నిలో బిజీగా ఉంటాడ‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఇది నిజ‌మా? అన్న ప్ర‌శ్న‌కు రాహుల్ రవీంద్ర‌న్ నుంచి ఆన్స‌ర్ వ‌చ్చింది. ఓకింత విస్మ‌యానికి గుర‌వుతూ అత‌డు ఇచ్చిన జ‌వాబు అంద‌రికీ షాకింగ్ స‌ర్ ప్రైజ్ అనే చెప్పాలి.

``ఈ ప్ర‌చార‌మంతా ఆధారం లేనిది. కేవ‌లం రూమ‌ర్ మాత్ర‌మే. అది ఎలా వ్యాపించిందో అస్స‌లు అర్థం కావ‌డం లేదు`` అని రాహుల్ ర‌వీంద్ర‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేశారు. మ‌న్మ‌ధుడు 2 రిలీజ‌య్యేవ‌ర‌కూ వేరొక ప్రాజెక్టు గురించిన ఆలోచ‌నేదీ చేయ‌లేద‌ని తెలిపారు. మ‌న్మ‌ధుడు 2 రిలీజ్ త‌ర్వాత త‌దుప‌రి ప్రాజెక్టు గురించి ఆలోచిస్తాన‌ని రాహుల్ అన్నారు. దీనిని బ‌ట్టి.. అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ పై జ‌రిగిన‌ది అంతా కేవ‌లం అస‌త్య‌ప్ర‌చారం అని అర్థ‌మ‌వుతోంది. మ‌న్మ‌ధుడు 2 ఆగ‌స్టు 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.