Begin typing your search above and press return to search.

షాకిచ్చిన హీరో..ఇన్ స్టాగ్రామ్ టు హీరోయిన్..

By:  Tupaki Desk   |   28 July 2018 5:30 PM GMT
షాకిచ్చిన హీరో..ఇన్ స్టాగ్రామ్ టు హీరోయిన్..
X
హీరో దర్శకుడయ్యాడు.. మరో హీరోను ఒప్పించాడు. ఇన్ స్టాగ్రామ్ లో అమ్మాయి నచ్చడంతో ఆమెను హీరోయిన్ గా పెట్టాడు. ఇలా అన్నీ కలగా కలిసిపోయి ఓ చిత్రం రూపొందింది.. అదే ‘చి.ల.సౌ’ మూవీ. ‘అందాల రాక్షసి’ ఫేమ్ హీరో రాహుల్ రవీంద్రన్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్కినేని నాగార్జున మేనల్లుడు ‘సుశాంత్’ హీరోగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రుహాని శర్మను హీరో రాహుల్ రవీంద్రన్ తీసుకున్నాడు. ఈమె గతంలో యాడ్ ఫిల్మ్స్ చేసింది. ఈ హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో చూసిన రాహుల్ ఆమెకు హీరోయిన్ చాన్స్ ఇచ్చాడు. ఆడిషన్స్ రావాలని చెప్పి అన్నీ ఓకే అయ్యాక సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశాడు.

30 ఏళ్లు నిండిన ఓ అబ్బాయి - అమ్మాయి ఒకరినొకరు పరిచయమైన ఒక్కరోజులోనే ప్రేమలో ఎలా పడతారు..? పెద్దలను ఎలా ఒప్పించి పెళ్లి చేసుకున్నాడన్నదే కథ.. ఈ సినిమాలో అర్జున్ పాత్రలో సుశాంత్ - అంజలి పాత్రలో రుహాని నటించారు. జూలై 27న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల ఆగస్టు3న రిలీజ్ చేస్తున్నారు.