Begin typing your search above and press return to search.

అతను మెగా ఛాన్స్ మిస్సయ్యాడా?

By:  Tupaki Desk   |   25 May 2016 1:30 PM GMT
అతను మెగా ఛాన్స్ మిస్సయ్యాడా?
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలకే కాదు.. హీరోయిన్లకు కూడా క్రేజ్ తక్కువేమీ కాదని రుజువు చేస్తోంది నాగబాబు కూతురు నీహారిక. ‘ఒక మనసు’ సినిమాలో నీహారిక కాకుండా మరో హీరోయిన్ నటించి ఉంటే ఈ సినిమా గురించి ఇంత చర్చ జరిగేది కాదు. ఆ సినిమాకు అంత హైప్ వచ్చేదీ కాదు. బుల్లితెర మీద - వెబ్ సిరీస్ ద్వారా తన టాలెంట్ చాటుకుని.. తన ఫ్యామిలీ నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాక అందరినీ ఒప్పించి.. నీహారిక హీరోయిన్ గా అరంగేట్రం చేయడానికి సిద్ధమవడంతో అందరిలోనూ ఈ అమ్మాయి నటన ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి మొదలైంది. ఇక ఆడియో వేడుక నాటి మెగా హీరోల హంగామాతో ‘ఒక మనసు’ హాట్ టాపిక్ అయిపోయింది.

పైగా ఆడియో కూడా చాలా బాగుండటంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. మొత్తంగా ‘ఒక మనసు’ మంచి హైప్ మధ్య జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి క్రేజీ మూవీలో నటించే ఛాన్స్ మిస్సయిపోయాడు యువ కథానాయకుడు రాహుల్ రవీంద్రన్. ‘ఒక మనసు’లో ముందు హీరోగా అనుకున్నది అతడినేనట.

ఐతే ఈ సినిమా నిర్మాణంలో టీవీ9 భాగస్వామ్యం మొదలయ్యాక సీన్ మారిపోయిందట. రాహుల్ రవీంద్రన్ ను తప్పించి నాగశౌర్యను హీరోగా తీసుకొచ్చారట. ఐతే దర్శకుడు రామరాజు మాత్రం రాహుల్ తోనే సినిమా చేయాలని ఆశపడ్డాడట. ఐతే నాగశౌర్య సినిమాలోకి రావడం వల్ల క్రేజ్ ఇంకాస్త పెరిగిందన్నది వాస్తవం. అతడికంటూ కొంచెం ఫాలోయింగ్ ఉంది. పైగా ‘కళ్యాణ వైభోగమే’ హిట్ తో ఊపుమీదున్నాడు. మొత్తానికి ఓ క్రేజీ మూవీలో ఛాన్స్ మిస్సయ్యాడన్నమాట రాహుల్ రవీంద్రన్.