Begin typing your search above and press return to search.

కెరీర్ బాగున్నపుడే అన్నీ చేయాలి

By:  Tupaki Desk   |   25 Oct 2017 11:30 PM GMT
కెరీర్ బాగున్నపుడే అన్నీ చేయాలి
X
కొంతమంది అదృష్టం ఏమిటో గాని సినిమా ఇండస్ట్రీలో ఒక పని చేద్దామని వస్తే మరొక పని దొరుకుతుంటోంది. ఏ ఛాన్స్ వచ్చినా ముందు ఇండస్ట్రీలో ఎదో రకంగా స్థానం దక్కించుకోవాలి అందుకోసమే ఏ అవకాశం వచ్చినా వదులుకోరు. ముఖ్యంగా దర్శకులు అవ్వడానికి వచ్చిన చాలా మంది యువకులు నటులుగా మారిపోతున్నారు. వారిలో సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవిచంద్రన్ ఒకరు.

అందాల రాక్షసి సినిమాతో తెలుగులో పరిచయం అయిన ఈ నటుడు.. ముందుగా దర్శకుడు అవుదామని కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడట. ముంబైలో మంచి జాబ్ వదిలేసుకొని మరి ఏడాదికి సరిపడా డబ్బును దాచుకొని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడట. ఆ తర్వాత 2006 లో మద్రాసి సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాహుల్ చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే.. కమల్ హాసన్ నటించిన నాయగన్ సినిమా నాపై చాలా ప్రభావం చూపింది. సినిమాల్లోకి రావాలనే ఆసక్తిని రేపింది. త్వరలోనే సుశాంత్ తో ‘చి౹౹ల౹౹సౌ’ అనే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాను. ఇక యాక్టింగ్ బాగున్నా డైరెక్షన్ వైపు రావడానికి నా కెరీర్ కారణం. ముందుగా అనుకున్నట్లు డైరెక్షన్ లో రాణించాలి. కెరీర్ మంచిగా ఉన్నపుడే ఆ అవకాశాన్ని సద్వినియెగం చేసుకోవాలి. నా భార్య చిన్మయి కూడా నాకు చాలా సపోర్ట్ గా ఉందని రాహుల్ తెలిపాడు.

ఇక సుశాంత్ ని ఎంచుకోవడానికి గల కారణాన్ని చెబుతూ.. ఆయనకి ఒక కొత్త కథతో సినిమాను చెయ్యాలని ఉందని ఒక పార్టీలో కలిసినపుడు చెప్పారు. దీంతో తన దగ్గర ఉన్న ఒక డిఫరెంట్ కథను చెప్పను. అతనికి నచ్చడంతో త్వరగానే నిర్మాత కూడా సెట్ అయ్యారు. త్వరలోనే ఆ మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ఇక తాను నటించిన హౌరా బ్రిడ్జ్ - దృష్టి అనే రెండూ సినిమాల కూడా షూటింగ్ పూర్తిచేసుకున్నాయని చెబుతూ.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయని తెలిపాడు.