Begin typing your search above and press return to search.
చిన్మయి.. ఇదేనా నీ అసలు రూపం
By: Tupaki Desk | 16 Jun 2019 10:17 AM GMTగత కొన్ని రోజులుగా తమిళ మీడియా మరియు తెలుగు మీడియా చిన్మయి గురించిన కథనాలు తెగ ప్రసారం చేయడం.. ప్రచురించడం జరుగుతుంది. మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు స్టార్స్ మరియు సెలబ్రెటీలపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది. స్త్రీ వాదం అంటూ పలు సందర్బాల్లో మాట్లాడటం జరిగింది. ఆడవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చిన్మయి చిన్నపాటి యుద్దమే చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన 'మన్మధుడు 2' టీజర్ ఆమెను విమర్శల పాలు జేసింది.
మన్మధుడు 2 టీజర్ విడుదలైన వెంటనే చిన్మయి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మన్మధుడు 2 టీజర్ లో శృతి మించిన రొమాన్స్ ఉన్నదని.. స్త్రీ సాధికారత మీటూ అంటూ మాట్లాడే చిన్మయి ఎలా ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా నీ అసలు రూపం కపట వేశదారి అంటూ చిన్మయి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చిన్మయిపై విమర్శలకు ఆమె భర్త మన్మధుడు 2 చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సమాధానం ఇచ్చాడు.
ఉమెన్స్ లవ్ మేకింగ్ సీన్స్ చేస్తే ఎలా ఆడవారిని అవమానించినట్లవుతుందని రాహుల్ ప్రశ్నించాడు. నా భార్యను కపట వేశదారి అంటూ విమర్శిస్తున్న వారు ఒకసారి వారి గురించి ఆలోచించాలి. మేము ఎప్పుడు కూడా యాంటీ సెక్స్ అనే ఫీలింగ్ కలిగించామా. మన దేశంలో 1.4 బిలియన్ టైమ్స్ సెక్స్ గురించి ఆలోచిస్తారు. అయితే వారెవ్వరు కూడా బయటకు ఆ విషయాన్ని మాట్లాడేందుకు ఆసక్తి చూపించరు. అలాంటి వారు కపటవేశదారులు అంటూ రాహుల్ అన్నాడు.
మన్మధుడు 2 చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టైటిల్ కు తగ్గట్లుగా సినిమా ఉంటుందనిపించడంతో పాటు నాగార్జున లుక్ చాలా బాగుందని టాక్ దక్కింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మన్మధుడు 2 చిత్రంతో దర్శకుడిగా రాహుల్ రవీంద్ర మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.