Begin typing your search above and press return to search.
ఆ ఫ్లాప్ నుంచి ఇప్పటికి తేరుకున్నాడట పాపం!
By: Tupaki Desk | 17 March 2021 5:30 PM GMTరాహుల్ రవీంద్రన్ మంచి నటుడు అని అంతా అనుకునేలోగా, నేను డైరెక్టర్ ను కూడా అనేసి ఆయన మెగా ఫోన్ పట్టేసుకున్నాడు. నాగార్జున కథానాయకుడుగా 'మన్మథుడు 2' తీసేశాడు. 'మన్మథుడు 2' అనగానే అందరికీ కూడా 'మన్మథుడు' సినిమా కళ్లముందు మెదిలింది. కె.విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'మన్మథుడు' సినిమా నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ .. మాటలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. ఇప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు మరిచిపోలేదంటే, ఎంతగా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
'మన్మథుడు 2' కూడా అదే స్థాయిలో ఉంటుందని అంతా భావించారు. సరైన సమయంలో నాగార్జున మంచి సీక్వెల్ చేస్తున్నాడని అనుకున్నారు. సీక్వెల్ కి కూడా ఆయనే నిర్మాత కావడంతో అందరిలోను మరింతగా అంచనాలు పెరిగాయి. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. అయితే ఈ సినిమా చూసినవాళ్లు తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. అసలు ఈ కథాకథనాలకు నాగార్జున ఎలా ఓకే చెప్పాడని అనుకున్నారు. ఈ మాత్రం కథకు ఫారిన్ కి వెళ్లడం ఎందుకు? అనే ప్రశ్నవేసుకుని, తమకి తోచిన సమాధానమేదో చెప్పుకుని ఇళ్లకు పోయారు.
ఆ సినిమా అంతగా పరాజయం పాలైన తరువాత రాహుల్ రవీంద్రన్ ఫీలైనట్టుగా .. నాగార్జున ధైర్యం చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత నటుడిగా కూడా రాహుల్ రవీంద్రన్ ఎక్కడా కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు దర్శకుడిగానే మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఆయన ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసుకున్న రాహుల్ రవీంద్రన్, రీసెంట్ గా అల్లు అరవింద్ - బన్నీ వాసులకు వినిపించాడట. ఇద్దరూ కూడా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించి, వచ్చే ఏడాదిలో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట.