Begin typing your search above and press return to search.
'చి ల సౌ' కి ఆమెను వద్దన్నాడట
By: Tupaki Desk | 2 Sep 2018 2:30 PM GMT‘చి ల సౌ’ సినిమాతో గొప్ప పేరే సంపాదించింది రుహాని శర్మ. సినిమాకు హైలైట్ ఆమె పాత్ర.. నటనే. ఒక కొత్త అమ్మాయి ఇలా నటించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందం.. అభినయం రెండూ ఉన్న రుహానిని చూసి ఫిదా అయిపోయారు. సమంత అయితే.. ఈ ఏడాది తెలుగులో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డులన్నీ రుహానికే దక్కాలని కితాబిచ్చింది. ఇంతగా ఇంప్రెస్ చేసిన రుహానిని.. ఆడిషన్స్ కోసం వచ్చినపుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తిరస్కరించాడట.
పంజాబీలో మ్యూజిక్ వీడియోలతో పాపులర్ అయిన తాను.. తమిళంలో ఓ సినిమా చేశానని.. ఆ తర్వాత ఖాళీగా ఉన్నానని.. అలాంటి సమయంలో తాను ఫేస్ బుక్ లో పెట్టిన ఒక మామూలు ఫొటో చూసి ఇంప్రెస్ అయి హీరో సుశాంత్ ‘చి ల సౌ’ కోసం రాహుల్ రవీంద్రన్ కు రికమండ్ చేశాడని రుహాని వెల్లడించింది.
తన నంబర్ కనుక్కుని రాహుల్ ఆడిషన్స్ కు పిలిచాడని.. ఆడిషన్స్ కదా అని తాను మోడర్న్ గా తయారై వెళ్లానని.. ఆ లుక్ లో తనను చూసి తన సినిమాకు సెట్ కానని రాహుల్ ఫిక్సయిపోయాడని.. తనకు నో చెప్పాడని రుహాని తెలిపింది. ఐతే తాను ఒక చిన్న పట్టణం నుంచి వచ్చానని.. మధ్య తరగతి అమ్మాయినే అని.. సినిమాలో హీరోయిన్ లాగే తాను కూడా అని సర్ది చెప్పి.. అంతకుముందు వేసుకున్న మోడర్న్ డ్రెస్ తీసి.. సినిమాలో హీరోయిన్ లాగే చుడీదార్ వేసుకుని వెళ్లి కనిపిస్తే.. అప్పటికి కానీ రాహుల్ ఆలోచన మారలేదని రుహాని తెలిపింది. ‘చి ల సౌ’లో హీరోయిన్ పాత్ర తన మనసుకు ఎంతో నచ్చిందని.. దీంతో ఆ సినిమాలో నటించినన్నాళ్లూ ఆ పాత్రలోనే లీనమై ఆమెలాగే ప్రవర్తించడం మొదలుపెట్టానని.. అందువల్ల ఈజీగా సీన్స్ అయిపోయేవని.. ఎక్కువ టేక్స్ కూడా తీసుకోలేదని రుహాని చెప్పింది.