Begin typing your search above and press return to search.
వారిని కూడా శిక్షించాలి : ట్యాక్సీవాలా డైరెక్టర్
By: Tupaki Desk | 23 Nov 2018 1:30 AM GMTచాలా నెలలుగా వాయిదాలు పడుతూ వచ్చిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. పలు ఒడుదొడుకుల మద్య విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. దాంతో ఈ చిత్రంకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అప్పుడే ఈ చిత్రం దాదాపుగా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రం విడుదలకు ముందే మొత్తం వీడియో లీక్ అయిన విషయం తెల్సిందే. సినిమా లీక్ అవ్వడంతో రకరకాలుగా ప్రచారం జరిగింది. అసలు ఈ చిత్రంను విడుదల చేయాలనే ఆసక్తి యూనిట్ సభ్యులకు లేదనే వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా చిత్రం లీక్ పై దర్శకుడు సంక్రిత్యన్ స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ.. సినిమా లీక్ అయిన సమయంలో అంతా కూడా డిప్రెషన్ లోకి వెళ్లి పోయాం. లీక్ అయిన సినిమా చూసి ఒకొక్కరు ఒక్కోలా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సినిమా విడుదల కాదనే ప్రచారం జరిగిన నేపథ్యంలో నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా కూడా ఒక్కసారిగా నాపై అపనమ్మకం పెట్టుకున్నారు. కాని సినిమా ఫైనల్ గా విడుదలై మంచి టాక్ ను దక్కించుకుంది. పైరసీ చేసిన వ్యక్తి మీ ముందు ఉంటే అతడిని కొట్టాలనుకుంటారా అంటూ యాంకర్ ప్రశ్నించగా దర్శకుడు వింత సమాధానం చెప్పాడు. ఆ వ్యక్తి కావాలని పైరసీ చేయలేదు. అయినా అతడు శిక్షను అనుభవిస్తున్నాడు. తాము డాటాను స్టోర్ చేసిన వద్ద అతడు కొత్తగా చేరాడు. అతడికి సినిమాను తన వారికి ఎక్ల్యూజివ్ గా చూపించాలనే బుద్ది పుట్టింది. దాంతో అతడు బయటకు తీసుకు వెళ్లడం, అక్కడ నుండి అలా అలా బయట షేర్ అయ్యింది. ఇక్కడ ఆ ఒక్కడిదే తప్పు అనలేం. ఒకరి నుండి ఒకరు షేర్ చేసుకున్న వారు అంతా కూడా తప్పు చేసినట్లే అని, శిక్షించాల్సి వస్తే దాన్ని చూసిన వారిని, షేర్ చేసిన వారిని అందరిని కూడా శిక్షించాలని అన్నాడు. పైరసీ చేయడమే కాదు, పైరసీ చూడటం కూడా నేరమే అన్నాడు దర్శకుడు.