Begin typing your search above and press return to search.

2.15 అవర్స్ మూవీకి 3.3 గంటల ట్రైలర్

By:  Tupaki Desk   |   14 Nov 2018 10:59 AM GMT
2.15 అవర్స్ మూవీకి 3.3 గంటల ట్రైలర్
X
హెడ్డింగ్ చదివాక రెండుంపావు గంటల సినిమాకు మూడు గంటల ట్రైలర్ ఏమిటి అనే డౌట్ రావడం సహజం. కానీ టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంక్రీత్యాన్ మాత్రం ఇదే మాట అంటున్నాడు. సాంకేతిక కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు థియేటర్లలోకి అడుగు పెడుతున్న టాక్సీవాలాను పైరసీ భూతం ఇంకా వెంటాడుతూనే ఉంది. మరో మూడు రోజుల్లో విడుదల కానుండగా ఎడిట్ కానీ రఫ్ కాపీ మరోసారి ఆన్ లైన్ లో వదలడంతో రాహుల్ తో సహా టీమ్ మొత్తం కన్నీళ్లు పెట్టుకోవడం ఒక్కటే తక్కువైంది.

గత రెండు మూడు వారాలకు పైగా దీని పోస్ట్ ప్రొడక్షన్ మీద అహోరాత్రాలు కష్టపడుతున్న రాహుల్ బృందం పైరసీ న్యూస్ విన్నప్పటి నుంచి దాన్ని నెగటివ్ గా కాకుండా పాజిటివ్ గా తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రీ రిలీజ్ లో విజయ్ దేవరకొండ చెప్పినట్టు కంటెంట్ తో కొట్టి కలెక్షన్ల రూపంలో పైరసీతో వెక్కిరిస్తున్న వాళ్లకు సమాధానం చెప్పాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. రాహుల్ మాత్రం అవుట్ ఫుట్ మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. టాక్సీవాలా గురించి తాను చాలా గర్వంగా ఫీలవుతున్నానని సక్సెస్ అవుతుందన్న భరోసా తనకు ఉందని ఎన్ని నిద్ర లేని రాత్రులు కన్నీళ్లు నిండిన కళ్ళతో గడిపామో తన టీమ్ కు తెలుసని ఫలితం వచ్చాక మాట్లాడతాను అని అంటున్నాడు.

సోషల్ మీడియాలో సైతం టాక్సీవాలా గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. తమను ఎవరో రెచ్చగొట్టడం వల్లే ఈ వెర్షన్ పెడుతున్నామని మెసేజ్ చేసిన పైరసీ దారులు తమ పైత్యానికి కారణాలు వెతుక్కోవడం గమనార్హం. నిజానికి టాక్సీవాలా సెన్సార్ అయిన ఫైనల్ వెర్షన్ ఉన్నది 2 గంటల 15 నిమిషాలే. కానీ టైటిల్స్ - గ్రాఫిక్స్ ఇవేవి లేకుండా పైరసీలో బయటికి వచ్చిన ప్రింట్ లో మాత్రం 3 గంటల 25 నిమిషాల ఫుటేజ్ ఉంది. ఇదే మాట అంటే అదో ట్రైలర్ లా భావించి స్పోర్టివ్ గా తీసుకోమంటున్నాడు రాహుల్.