Begin typing your search above and press return to search.
బిగ్ బాస్: శ్రీముఖిని చేసుకునేవాడికి... రాహుల్ సెటైర్...
By: Tupaki Desk | 4 Oct 2019 5:10 AM GMTమంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో...గురువారం ఎపిసోడ్లో ఆసక్తికర ఘటనలు జరిగాయి. హౌస్‌కి కెప్టెన్ గా ఉన్న శ్రీముఖిని టార్గెట్ చేస్తూ రాహుల్ - వరుణ్ జోకులేసుకోవడం, రాహుల్-పునర్నవి మధ్య డెటాల్ గురించి గొడవ ఇలా హౌస్ లో పలు ఇంట్రస్టింగ్ స్టింగ్ సీన్లు జరిగాయి. మొదట బిగ్ బాస్ హౌస్ లో లౌడ్ స్పీకర్ గా పేరొందిన శ్రీముఖి వాయిస్ ని ఉద్దేశించి వరుణ్-రాహుల్ ముచ్చట్లు పెట్టుకున్నారు.
శ్రీముఖిని పెళ్లి చేసుకుబోయే వాడి పరిస్థితి ఏంటో? అని రాహుల్ వరుణ్ అని అడిగాడు. ఏమో నాకేం తెలుసు. పెళ్లి అయ్యాక కూడా అరుస్తుందేమో - అప్పుడు అతను చెవిలో ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటాడేమో అని వరుణ్ సెటైర్ వేశాడు. ఇక తర్వాత పునర్నవి వచ్చి డెటాల్ ఎక్కువ వాడేస్తున్నావు...దేనికి వాడుతున్నావ్...లేదా తాగేస్తున్నావా ? అంటూ రాహుల్ పై ఫైర్ అవుతూ మాట్లాడింది. పున్నూ అరుపులకు రాహుల్ సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాడు.
దీంతో పున్నూ బాత్ రూంలో నుంచి డెటాల్ డబ్బా తెచ్చి చూపించి..ఎందుకు ఇంత అయిపోయింది..మొత్తం తాగేస్తున్నావా అంటూ మాట్లాడుతూనే ఉంది. దీనికి రాహుల్ అరవకు నిదానంగా మాట్లాడు - తెలుసుకుని మాట్లాడు అనేసరికి పున్నూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. అయితే ఎందుకు వాళ్ళు అలా గొడవ పడతారని శ్రీముఖి వితికాని అడిగింది. వాళ్ల మధ్యన మనం ఎవరైనా వెళ్తే బిస్కెట్ అవుతాం లైట్ తీసుకో అంటూ వితికా శ్రీముఖికి సూచించింది.
ఇక పునర్నవి అభిమాన సంఘాలు పెడుతున్నామని శివజ్యోతి - అలీ - వరుణ్ మాట్లాడుకుంటుండగా, మధ్యలో రాహుల్ వచ్చి పునర్నవి అభిమాన సంఘానికి పీఏగా ఉంటా.. పీఆర్వోగా ఉంటా అంటూ ఆమె చేతులు పట్టుకుని నొక్కుతూ కాకాపట్టే ప్రయత్నం చేశాడు.