Begin typing your search above and press return to search.

రాహుల్ శ్రీముఖి క‌లిసి గేమ్ ప్లాన్ చేశారా..!

By:  Tupaki Desk   |   22 Sep 2019 5:45 AM GMT
రాహుల్ శ్రీముఖి క‌లిసి గేమ్ ప్లాన్ చేశారా..!
X
వీకెండ్ వచ్చేసింది... కింగ్ నాగార్జున వచ్చేస్తారు... ఇంటి సభ్యులకు గడ్డి పెట్టేస్తారు... ఇవి గత శనివారాలు జరిగిన ప్రక్రియ. ఆ ప్రక్రియకు భిన్నంగా కింగ్ నాగార్జున ఈ శనివారం ఎపిసోడ్ ఇంటి సభ్యులని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే అంతకంటే ముందు శుక్రవారం హౌస్‌ లో జరిగిన విశేషాలని మన టీవీ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. ఎపిసోడ్ ప్రారంభంలో వరుణ్ - వితికా - పునర్నవి - రాహుల్ గ్యాంగ్ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే వరుణ్ - రాహుల్ లు అక్కడ నుంచి వెళ్లిపోయాక...వితికా - పునర్నవి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు.

రాహుల్ అర్ధరూపాయికి రూపాయి యాక్టింగ్ చేస్తాడని వితికా సెటైర్ వేసింది. అలాగే వరుణ్ ఎప్పుడూ తనకు ఫేవర్‌ గా మాట్లాడుకుంటాడు.. బయట జనాలకేమో వితికా తప్పు చేసినా వరుణ్ కరెక్ట్‌ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని అనుకుంటారని పున్నూతో గుసగుసలాడింది. ఆ తర్వాత బయట సోఫాలో రాహుల్ - పునర్నవి - వరుణ్ కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఈ సమయంలో పున్నూ...సరదాగా రాహుల్ ని ఆటపట్టించింది.

‘రాహుల్ - శ్రీముఖి బయట ఫ్రెండ్స్.. వీళ్లు బయట డీల్ మాట్లాడుకుని హౌస్‌ లో ఇలా ఉండాలని ఆ ప్లాన్‌ ని వర్కౌట్ చేస్తున్నారని పున్నూ వరుణ్ తో చెప్పింది. ఇద్దరు ఆస్కార్ నామినీ పెర్ఫామెన్స్ ఇస్తున్నారని, వీళ్లు గొడవలు పడటం అంతా డ్రామా - వీళ్ల ప్లాన్‌ లో ఇద్దరూ బాగా ఇన్వాల్వ్ అయ్యారని - నటిస్తూ గేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని - కాబట్టి వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చింది.

వీరి చర్చా కార్యక్రమం అయిపోయాక...బిగ్ బాస్ ‘మ్యాక్స్’ మోస్ట్ స్టైలిష్ మెన్ - విమెన్ టాస్క్ ఇచ్చారు. మ్యాక్స్ తరుపున అందరికి కొత్త బట్టలు పంపి వాటిని ధరించుకోవాలని కోరారు. అందులో ఎవరు బాగా స్టైలిష్ గా ఉన్న మెన్ - విమెన్ లని సెలక్ట్ చేయాలని కెప్టెన్ మహేశ్ ని కోరారు. దీంతో స్టైలిష్ మెన్-వరుణ్ - స్టైలిష్ విమెన్-వితికాలని సెలక్ట్ చేశారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున ఇంటి సభ్యులతో ముచ్చటించారు. మొన్న ఎలిమినేషన్ ప్రక్రియలో త్యాగాలు చేసిన ఇంటి సభ్యులని పొగడ్తలతో ముంచెత్తారు.

ముఖ్యంగా రాహుల్ పునర్నవి కోసం కాకరకాయ జ్యూస్ తాగడాన్ని మెచ్చుకున్నారు. ఇక నెక్స్ట్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని చెప్పి రాహుల్ ఎలిమినేట్ అవుతున్నాడని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. అయితే ఎప్పటిలాగే మామూలు ప్రాసెస్ కానిచ్చేసి...చివరికి ఫేక్ ఎలిమినేషన్ జరిగిందని...రాహుల్ ఎలిమినేట్ కాలేదని షాక్ ఇచ్చారు. అయితే ఈ విషయం మిగతా ఇంటి సభ్యులకు తెలియదు. ఆదివారం ఎపిసోడ్ లో వారికి సర్ ప్రైజ్ ఇవ్వొచ్చు.