Begin typing your search above and press return to search.
కిక్ బాక్సింగ్ పై కుర్రహీరో మోజు!
By: Tupaki Desk | 27 March 2019 5:30 PM GMTఏ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలతో పోలిస్తే ఈ రంగంలోనే పుట్టి - ఇక్కడే పెరిగిన హీరోల పరిణతి - వినమ్రత వేరుగా ఉంటాయి. ఈ రెండు విషయాల్లో విజయ్ మాస్టార్ వారసుడు రాహుల్ విజయ్ ఇస్మార్ట్ అనడంలో సందేహం లేదు. వినయవిధేయతతో పాటు తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న లక్షణాలు ఈ నవతరం హీరోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాటల్లో నిజాయితీ .. పరిణతి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ మాయ ప్రేమేమిటో చిత్రంతో తొలి అడుగు వేసిన రాహుల్ ఆరంభమే ఫ్లాప్ ని అందుకున్నాడు. సొంత బ్యానర్ లోనే విజయ్ మాస్టార్ వారసులు స్వయంగా ఆ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఆ సినిమా ఫెయిలైనా నేను ఫెయిల్ కాలేదని ప్రశంస దక్కిందని రాహుల్ ఆనందం వ్యక్తం చేశారు. సినిమా ప్లాపైనా నువ్వు బావున్నావు.. మంచి భవిష్యత్ ఉంది అని ఆశీర్వదంచారంతా. మొదటి సినిమా చేస్తుండగానే రెండో సినిమా అవకాశం వచ్చింది అంటే అది మనలో ప్రతిభ ఉందని నమ్మడం వల్లనే కదా! అని రాహుల్ అన్నారు.
రాహుల్ విజయ్ నటించిన రెండో చిత్రం సూర్యకాంతం ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని నిర్వాణ సినిమాస్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాహుల్ పైవిధంగా స్పందించారు. సూర్యకాంతం చిత్రంలో అభి పాత్రలో నటించాను. అమాయకుడైన అభికి సూర్యకాంతం వల్ల తలెత్తే ఇబ్బందుల్ని తెరపైనే చూడాలి. అయితే సూర్యకాంతం అనగానే నెగెటివ్ కాదు.. అందులోనే ఎంతో అర్థవంతమైన సెన్సిబిలిటీస్ ని తెరపై చూపించారు దర్శకుడు. నటుడిగా నాకు చక్కని పేరు తెచ్చే చిత్రమిదని తెలిపారు. నిహారిక ఈ చిత్రంలో అందరినీ డామినేట్ చేసే పాత్రలోనే నటించిదని అన్నారు.
తదుపరి నటించే సినిమాల గురించి చెబుతూ.. ప్రస్తుతం తెలుగు- తమిళ్ ద్విభాషా చిత్రం ఈ ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభం కానుందని తెలిపారు. కాలేజ్ కుమార అనే కన్నడ చిత్రానికి రీమేక్ ఇది. ఒరిజినల్ దర్శకుడు సంతు ఇక్కడా దర్శకత్వం వహిస్తారు. తెలుగు వెర్షన్ లో హీరో తండ్రిగా శ్రీకాంత్ నటిస్తారు. తమిళ వెర్షన్ లో ప్రభు ఆ పాత్రలో కనిపిస్తారని వెల్లడించారు. దాంతో పాటే కిక్ బాక్సింగ్ నేపథ్యంలో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాం.. కొత్త దర్శకుడు మణి తెరకెక్కిస్తారని తెలిపారు. కిక్ బాక్సింగ్ లో ఐదేళ్ల పాటు శిక్షణ తీసుకున్నా. దాంతోపాటే మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. డాడ్ విజయ్ మాస్టార్ ఇన్వాల్వ్ మెంట్ లేకుండానే స్వతహాగానే నేర్చుకున్నానని తెలిపారు. నాన్న గారు షూటింగులతో నిరంతరం బిజీగా ఉండడం వల్ల కెరీర్ ఎంపిక సొంత నిర్ణయమేనని అన్నారు. ఎనిమిదో తరగతిలోనే నేను హీరో అవుతానని నాన్నగారితో అన్నాను. మా కోరిక కూడా అదేనని ప్రోత్సహించారని రాహుల్ విజయ్ తెలిపారు.