Begin typing your search above and press return to search.
నిహారిక ఇండివిడ్యువాలిటీకి సలాం
By: Tupaki Desk | 28 March 2019 4:29 AM GMTమహిళల్లో ఇండివిడ్యువాలిటీ గురించి నిరంతరం చర్చ సాగుతుంటుంది. అయితే రంగుల ప్రపంచంలో ఇండివిడ్యువాలిటీతో ఎదిగేవాళ్లు అతి కొద్ది మందే. ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ గా ఉండి ఈ రంగంలో ఎదిగేందుకు సహకారం చేయాలి. అలా కాకుండా స్వీయ నిర్ణయాలతో తమకు తాముగా ప్లాన్ చేసుకుని తెలివైన అడుగులు వేసే కథానాయికలు ఈ రంగంలో కొందరు ఉంటారు. ఆ కోవకే చెందుతారు నిహారిక కొణిదెల. మెగాడాటర్ నటించిన `సూర్యకాంతం` ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన వ్యక్తిత్వం గురించి - ఇండివిడ్యువాలిటీ గురించి తన కోస్టార్.. సూర్యకాంతం కథానాయకుడు రాహుల్ విజయ్ తనపై ప్రశంసల వర్షం కురిపించారు.
``నిహారిక స్వతహాగానే స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి. సెట్స్ లో నిహారిక అల్లరి మాత్రమే కాదు.. పరిణతితో ఇండివిడ్యువాలిటీతో వ్యవహరించే తీరు అందరికీ నచ్చుతుంది. సూటిగా ఉండే తత్వం తనది. నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి` అంటూ చిట్ చాట్ లో రాహుల్ ప్రశంసలు కురిపించారు. వరుణ్ తేజ్ అన్న తనని ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడం వల్ల తనతో కలిసి నటించే అవకాశం దక్కిందని తెలిపారు. ఆడిషన్స్ చేసి వెంటనే ఓకే చెప్పారని, అంతకుముందు చెన్నయ్ వంటి చోటికి వెళ్లి రకరకాల హీరోల్ని పరిశీలించారని వెల్లడించారు.
అలాగే రంగుల ప్రపంచంలో మగాళ్ల స్వభావం గురించి రాహుల్ ఓ మాట చెప్పారు. ఇక్కడ ఎవరైనా చనువిస్తే చంకనెక్కేస్తారు. మెతగ్గా ఉంటే తేడాగా ప్రవర్తిస్తారు. అలాంటి వ్యక్తిత్వాన్ని తన కథానాయికలో చూడనే లేదని - బలమైన వ్యక్తిత్వాన్ని మాత్రమే చూశానని తెలిపారు. అమాయకత్వంతో కూడుకున్న కన్ఫ్యూజన్ మాస్టర్ (రాహుల్) తల్లిదండ్రుల బలవంతం వల్ల కాంతంని చూసేందుకు పెళ్లి చూపులకు వెళ్లాక.. అది ఫెయిలై - ఆ తర్వాత వేరొక అమ్మాయితో ప్రేమలో పడ్డాక.. తిరిగి తన జీవితంలోకి కాంతం ప్రవేశిస్తే ఏం జరిగింది? అన్నదే `సూర్యకాంతం` కథాంశం అని తెలుస్తోంది. ఈ కథలో రాహుల్ - నిహారిక - పూజ పాత్రధారి నటన మైమరిపించనుందని సెన్సార్ బృందం నుంచి లీక్ అందింది.