Begin typing your search above and press return to search.

చివ‌రికి ర‌త్తాలు ప్ర‌య‌త్నాలు అలా ఫెయిల్

By:  Tupaki Desk   |   6 July 2021 12:30 AM GMT
చివ‌రికి ర‌త్తాలు ప్ర‌య‌త్నాలు అలా ఫెయిల్
X
రాయ్ ల‌క్ష్మి కెరీర్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నా యూత్ లో ఫోక‌స్ మాత్రం త‌గ్గ‌డంలేదు. దానికి కార‌ణంగా ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో హీటెక్కించ‌డ‌మే. బికీనీ..టూపీసుల్లో ఎప్ప‌టిక‌ప్పుడు హీటెక్కిస్తూ అటెన్ష‌న్ డ్రా చేయ‌డం రాయ్ లక్ష్మి స్పెషాల్టీ. ఈ త‌ర‌హా అటెంప్ట్ లు అప్పుడ‌ప్పుడు అవ‌కాశాలు తెచ్చిపెట్టాయ‌న‌డంలో సందేహం లేదు. ర‌త్తాలు స్పీడ్ చూడ‌డం వ‌ల్ల‌నే ఇటీవ‌ల ప‌లువురు న‌వ‌త‌రం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమెను ఎంక‌రేజ్ చేసారు. కానీ ఎన్నిచోట్ల న‌టించినా తెలుగులో మాత్రం ఆఫ‌ర్ లేదు. ఇక్క‌డ సినిమా చేసి మూడేళ్లు అవుతోంది.

ఇప్ప‌టికీ టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఫీల‌ర్స్ వ‌దులుతూ ట‌చ్ లోనే ఉంది. ప్ర‌స్తుతం రాయ్ ల‌క్ష్మి తెలుగులో `ఆనంద భైర‌వి` అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని వాస్తవ క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. దేశంలో జ‌రిగిన ఓ అత్యాచార ఘ‌ట‌న ఆధారంగా చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. బాధితురాలి పాత్ర‌లో రాయ్ ల‌క్ష్మి న‌టిస్తుంది. ఇందులో మ‌రో కీల‌క పాత్ర‌లో అంజ‌లి న‌టిస్తోంది. ప్ర‌స్తుతానికి రాయ్ ల‌క్ష్మి చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా ఇదే. ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాల‌ని ఎంట్రీ ఇచ్చినా టైమ్ క‌లిసి రాలేదు.

నిజానికి ఇప్ప‌టివ‌ర‌కూ క‌థానాయిక‌గా కొన‌సాగ‌డం అదృష్టం అనుకుంటే ఇటీవ‌ల ఐటెమ్ నంబ‌ర్ల‌తో స్పాన్ ని పెంచుకుంది ఈ బ్యూటీ. అప్ప‌ట్లో ఖైదీనంబ‌ర్ 150 చిత్రంలో ఓసోసి ర‌త్తాలు త‌న‌కు మైలేజ్ ని పెంచింది.

కెరీర్ ఆద్యంతం మీడియం రేంజు హీరోల‌తోనే న‌టించిన ఈ బ్యూటీకి స్టార్ హీరోల చిత్రాల్లో న‌టించే ఛాన్స్ లు చాలా అరుదుగానే వ‌చ్చాయి. పెద్ద హీరోల చిత్రాల్లో స్పెష‌ల్ అప్పీరియ‌న్స్.. ఐటం పాట‌ల్లో మాత్ర‌మే క‌నిపించింది. చెప్పుకోద‌గ్గ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలేవి చేయ‌లేదు. అయితే కోలీవుడ్ లో మాత్రం బిజీగానే ఉంది. ప్ర‌స్తుతం అక్క‌డ మూడు సినిమాల్లో న‌టిస్తోంది. బాలీవుడ్ లో మూడు నాలుగు సినిమాలు చేసింది. కానీ అక్క‌డ రాణించ‌లేక‌పోయింది. చివ‌రికి కోలీవుడ్ లోనే స్థిర‌ప‌డి కెరీర్ బండిని లాగించేస్తోంది. తాజాగా రాయ్ ల‌క్ష్మి ప‌సుపు ప‌చ్చ బికినీలో అగ్గి రాజేస్తున్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.