Begin typing your search above and press return to search.

అమ్మమ్మ సినిమాని వాళ్లే డైరెక్ట్ చేయాలి

By:  Tupaki Desk   |   28 Feb 2016 11:02 PM IST
అమ్మమ్మ సినిమాని వాళ్లే డైరెక్ట్ చేయాలి
X
ఇప్పుడు బాలీవుడ్ లో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. తన అమ్మమ్మ సుచిత్రా సేన్ జీవిత గాధను తెరకెక్కించేందుకు రైమా సేన్ ప్రయత్నిస్తోంది. తనే ఓ నటి అయినా.. ఈ పాత్ర కోసం విద్యాబాలన్ ని సంప్రదించారు కూడా. అయితే డేట్స్ కుదరని కారణంగా.. సుచిత్రా సేన్ పాత్రను చేయలేనని విద్యాబాలన్ చెప్పేసింది. దీంతో ఇప్పుడు మరో నటిని ఎంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సుచిత్రా సేన్ పై తీసే బయోపిక్ కి.. సంజయ్ లీలా భన్సాలీతో కానీ, మణిరత్నంతో కానీ దర్శకత్వం చేయించాలని భావిస్తోంది మనవరాలు రైమా సేన్. వాళ్లు మాత్రమే ఆ మూవీకి న్యాయం చేయగలరన్నది ఈమె ఉద్దేశ్యం. అయితే.. తనే ఓ మంచి నటి అని ప్రూవ్ చేసుకున్నా.. అమ్మమ్మ రోల్ ని తను చేసే ఉద్దేశ్యం లేదట. తను చాలా బద్ధకస్తురాలిననీ, ఆ రోల్ కి న్యాయం చేయలేనని ఓపెన్ గానే చెప్పేసింది ఈ భామ.

అయితే విద్యా బాలన్ వెర్షన్ మాత్రం మరో రకంగా ఉంది. ఆ పాత్రకు, తనకు ఏ మాత్రం పోలిక కుదరడం లేదని.. అందుకే చేయలేకపోతున్నానని అనింది. సుచిత్రా సేన్ పాత్రకు.. రైమా సేన్ సరైన ఎంపిక అన్నది విద్యా బాలన్ ఉద్దేశ్యం. కానీ రైమా సేన్ మాత్రం.. ప్రస్తుతం కొందరు నిర్మాతలతోను, వేరే హీరోయిన్లతోనూ ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో స్పీడ్ పెంచింది.