Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కు వాన దెబ్బ.. రామ్ బిగ్ హోప్స్!
By: Tupaki Desk | 13 July 2022 1:30 PM GMTయువ హీరో రామ్ పోతినేని తన ఆశలన్నీ కూడా ది వారియల్ సినిమా పైన పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా తమిళనాడు ఇండస్ట్రీలో మంచి మార్కెట్ కూడా క్రియేట్ చేసుకోవాలి అని ఆ తర్వాత పాన్ ఇండియా మార్కెట్లో కూడా సక్సెస్ అందుకోవాలని అడుగులు వేస్తున్నాడు. అయితే ది వారియర్ సినిమా పరిస్థితి కాస్త అనుమానంగానే మారింది.
విడుదలకు ముందు మంచి పాజిటివ్ హైప్ అయితే క్రియేట్ అయింది కాని.. సీజమ్ కారణంగా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాతావరణం ఏమాత్రం అనుకూలించని పరిస్థితిలు ఏర్పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో వానలు పడుతూ ఉండడంతో జనాలు బయటకు పెద్దగా రావడానికి ఇష్టపడడం లేదు.
ముఖ్యంగా థియేటర్లో వెళ్లి సినిమా చూడడం అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారిపోయింది. దానికి తోడు సినిమా టికెట్ల రేట్లు కూడా ఎక్కువగా ఉండడంతో మరింత ఆసక్తి తగ్గింది అనే చెప్పాలి. ఇప్పటికే విడుదలైన కొన్ని సినిమాలకు ప్రేక్షకులు లేక థియేటర్స్ యాజమాన్యాలు థియేటర్లను మూసేస్తున్నాయి.
ఎగ్జిక్యూటర్స్ కూడా తెల్లగా సాహసాలు చేయడం లేదు. థియేటర్లో ప్రేక్షకులు ఎక్కువగా లేరంటే క్లోసింగ్ బోర్డులు పెట్టేస్తున్నారు.
అనవసరంగా కరెంటు బిల్లులు కట్టుకోవడం ఎందుకు అని ఎగ్జిబిటర్స్ అయితే ఇంతకు ముందు విడుదలైన హ్యాపీ బర్త్డే సినిమాను కూడా పూర్తిగా చాలా థియేటర్స్ నుంచి తీసేసారు. ఇక రామ్ పోతినేని ది వారియర్ సినిమాకు భారీగానే విడుదల చేస్తున్నప్పటికీ వాతావరణం గురించి అనుకూలించేలా లేదు.
అడ్వాన్స్ బుకింగ్స్ లో హడావిడి ఏమీ కనిపించడం లేదు. రామ్ సినిమాకు మాత్రమే కాకుండా రాబోయే థాంక్యూ సినిమాకు, రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు కూడా పెద్దగా బజ్ అయితే లేదు. ఈ సమయంలో టాలీవుడ్ నష్టాల్లో కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ముందుగా వచ్చే ది వారియర్ మూవీ ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.