Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' లో హైలైట్ గా నిలవనున్న రెయిన్ ఫైట్..!

By:  Tupaki Desk   |   30 Jun 2021 9:33 AM GMT
ఆర్.ఆర్.ఆర్ లో హైలైట్ గా నిలవనున్న రెయిన్ ఫైట్..!
X
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ట్రిపుల్ ఆర్ చిత్రంలో కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉంది. ఇక ఈ RRR గురించి బయటకు వస్తున్న కొత్త విషయాలు సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా చరిత్రలో ఎన్నడూ కలవని, రెండు వేర్వేరు కాలాలకు చెందిన ఇద్దరు రియల్ లైఫ్ పోరాట యోధులు కొమురం భీమ్ - అల్లూరి సీతారామరాజు జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపొందుతోంది. ఇందులో ఇద్దరి మధ్య పోరాట సన్నివేశాలు కూడా ఉంటాయి. రామ్ చరణ్ - ఎన్టీఆర్ మధ్య వచ్చే ఓ ఫైట్ సీన్ ఉద్వేగానికి గురి చేస్తుందని.. అది చూసి ప్రేక్షకులు ఎమోషనలై కన్నీళ్లు పెట్టుకుంటారని ఇటీవలే రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అలానే RRR లో తారక్ - చరణ్ ల మధ్య ఓ రెయిన్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని.. అది సినిమాకే హైలైట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. వర్షం నేపథ్యంలో ఇద్దరు హీరోల మధ్య వచ్చే ఈ తీవ్రమైన పోరాట సన్నివేశం సినిమా ఫస్ట్ హాఫ్ లో ఉంటుందని అంటున్నారు. మరి ఈ ఫైట్ సీన్ విజయేంద్ర ప్రసాద్ చెప్పినదేనా లేదా ఇంకో సన్నివేశమా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఇకపోతే సినిమా ప్రారంభంలో వేర్వేరు లక్ష్యాలు ఉన్న రామారావు - భీమ్.. తరువాత స్నేహితులుగా మారి ఒకే లక్ష్యం కోసం పోరాటం చేస్తారని తెలుస్తోంది. కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.