Begin typing your search above and press return to search.
రవీనా టాండన్ పై కాయిన్ ల వర్షం
By: Tupaki Desk | 20 April 2022 12:04 PM GMTకన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన క్రేజీ మూవీ 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఇటీవల ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనాలు సృస్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ చరిత్ర సృష్టిస్తోంది. కేజీఎఫ్ కు ఫ్రాంచైజీగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి పార్ట్ ని మించి దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రికార్డుల ధాటికి క్రేజీ చిత్రాల రికార్డులు తుడిచిపెట్టుకునోతున్నారు.
రాఖీ భాయ్ ప్రభంజనం ముందు టాప్ స్టార్ లు కూడా నిలబడలేకపోతున్నారు. ఓ రేంజ్ లో మాస్ హిస్టీరీ ప్రేక్షకుల్లో పూనిందా అనే స్థాయిలో ఉత్తరాది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బ్రహ్మరథం పడుతున్నారు. హిందీ బెల్ట్ లో తొలి రోజు 50 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 600 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిందని, రానున్న రోజుల్లో 1000 కోట్ల ని ఈ మూవీ అవలీలగా అధిగమించే అవకాశం వుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభ, యష్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తోడవ్వడంతో 'కేజీఎఫ్ 2'కు యావత్ దేశం మొత్తం ఫిదా అవుతోంది. ఈ సినిమా తో యస్ పాన్ ఇండియా వైడ్ గా యంగ్రీ యంగ్ స్టార్ గా మారిపోయాడు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ఇప్పడు యస్ క్రేజీ స్టార్ గా మారిపోయారు. అంతే కాకువండా ఇందులో నటించిన వాళ్లు కూడా ఇప్పడు దేశ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది ఇండియాగా మారారు. ఒక నాటి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రవీనాటాండన్ ఇందులో రమికా సేన్ గా ప్రధాని పాత్రలో నటించిన ఆకట్టుకున్నారు.
పవర్ ఫుల్ పాత్రలో అంతే పవర్ ఫుల్ గా కనిపించారు రవీనా. దీంతో ఆమె కూడా ఇప్పడు వార్తల్లో నిలుస్తోంది. మళ్లీ సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. తాజాగా ఓ థియేటర్లో సినిమా ప్రదర్శన సందర్భంగా సినిమా చివర్లో రవీనా టాండన్ చాప్టర్ 3 కి సంబంధించిన పేపర్స్ చూస్తుంటుంది. ఆ సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లో కొంత మంది రూపీ కాయిన్స్ ని వెదజల్లడం ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
థియేటర్లో తన పాత్రకు సంబంధించిన సీన్ వస్తున్న సమయంలో ప్రేక్షకులు కాయిన్స్ జల్లుతున్న వీడియోని రవీనా టాండన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సినిమా థియేటర్లలో స్క్రీన్ లపై ప్రేక్షకులు కాయిస్స్ జల్లుతున్న దృశ్యాలు చూశాను.
ఇలా చాలా ఏళ్ల తరువాత ఇలాంటి దృశ్యం పునరావృతం కావడం ఆనందంగా వుంది. లాస్ట్ డే లాస్ట్ షూట్ కి సంబంధించిన సీన్ ఇది' అంటూ సదరు షూటింగ్ కి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది రవీనా టాండన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.