Begin typing your search above and press return to search.

మహేష్ కొడుకు పుట్టినపుడు...

By:  Tupaki Desk   |   1 May 2017 6:13 AM GMT
మహేష్ కొడుకు పుట్టినపుడు...
X
మహేష్ బాబుకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ విషయం అనేక సార్లు ప్రూవ్ అయింది. బాలీవుడ్ హీరోయిన్స్ మొదట చెప్పేది మహేష్ పేరే. ప్రముఖ బ్రాండ్స్ కు ప్రచారం చేసేందుకు మొదట గుర్తుకొచ్చేది సౌత్ హీరో సూపర్ స్టార్ మహేషే. అయితే.. మహేష్ చేతిలో చాలానే బ్రాండ్స్ ఉంటాయ్ కానీ.. రెయిన్ బో హాస్పిటల్స్ కు ప్రచారం విషయంలో మాత్రంలో వేరే సంగతులు కూడా ఉన్నాయి.

మహేష్ బాబు ఓ బ్రాండ్ అంబాసిడర్ గా కాక మునుపు నుంచే.. ఈ ఆస్పత్రితో అనుబంధం ఉందట. ఒక పేరెంట్ గా తమతో ఆయనకు రిలేషన్ మొదలైందంటున్నారు ఆ ఆస్పత్రి ఎండీ రమేష్. ప్రీ మెచ్యూర్ బేబీ కావడంతో చాలా ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి వచ్చిందని.. అప్పటి నుంచి ఎన్నో సార్లు తాము కలిసేవారమని.. కొడుకు ఆరోగ్యం గురించి అనుక్షణం మహేష్ కేర్ తీసుకుంటాడని చెప్పారాయన. డెలివరీ డేట్ కంటే కొన్ని రోజుల ముందే పుట్టడంతో గౌతమ్ ను ఇంక్యుబేటర్ లో కొంతకాలం ఉంచాల్సి వచ్చిందన్నారు ఆ డాక్టర్.

అలాగే మహేష్ అభిమాని కుమారుడి ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని సార్లు కలిసిన తర్వాత.. తాము పిల్లలపై తీసుకునే శ్రద్ధను మహేష్ గమనించారని చెప్పారు రమేష్. ఆ తర్వాతే ఇలా బ్రాండ్ అండార్స్ మెంట్ చేయమని అడగడం.. యాడ్స్ లో నటించడం జరిగిందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/