Begin typing your search above and press return to search.
శస్త్ర చికిత్స వికటించిన నటి కోటి డిమాండ్
By: Tupaki Desk | 26 April 2021 6:32 AM GMTశస్త్ర చికిత్స ఫెయిలైనందున ప్రముఖ నటి చర్మవ్యాధి నిపుణుడి నుండి రూ.1కోటి డిమాండ్ చేసిన ఘటన సంచలనమైంది. బిగ్ బాస్ తమిళ పోటీదారు రైజా విల్సన్ చెన్నైకి చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ భైరవి సెంథిల్ తో వివాదం తెలిసినదే.
విల్సన్ భైరవి తన నుంచి డబ్బును దోచుకోవటానికి తప్పుడు చికిత్సలు సూచించారని నైపుణ్యం లేని వైద్య విధానాలు ఆమె జీవితాన్ని ప్రమాదంలో పడేశాయని ఆరోపించారు. తన ముఖం కమిలిపోయిన ఫోటోలను పంచుకున్న రైజా విల్సన్.. డాక్టర్ చేతకాని తనాన్ని విమర్శించారు. డాక్టర్ భైరవి ఆ ఆరోపణల్ని ఖండించగా..ఆమె తన వెర్షన్ ను మరోసారి ఇన్ స్టాలో వివరించారు. డాక్టర్ భైరవి నుంచి ఒక కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు రైజా ఇన్ స్టాలో పేర్కొన్నారు.
``సదరు మెడికల్ ప్రాక్టీషనర్ తప్పుడు ప్రకటనలు.. ప్రమోషన్స్ ద్వారా అమాయక ప్రజల నుండి డబ్బును దోచుకోవడం అన్యాయం. సామాజిక సేవ పేరుతో ఇలా తప్పుడు ప్రిస్కిప్షన్లతో ప్రజల నుండి వైద్యులు డబ్బును దోచుకోవడం చట్టవిరుద్ధం`` అని వ్యాఖ్యానించారు నటి రైజా. కాస్మోటాలజీ కి సంబంధించిన వివిధ సామాజిక వేదికలపై ఆమె చేసిన ప్రకటన ఆధారంగా డాక్టర్ భైరవి సెంథిల్ ను సంప్రదించాను. డాక్టర్ భైరవి సెంథిల్ .. ఆమె సిబ్బంది సంప్రదింపుల ప్రారంభం నుండి డబ్బును దోచుకోవటానికి మాత్రమే తప్పుడు చికిత్సలను సూచించారు. అలాగే వారి తప్పుడు చికిత్స కారణంగా నా ప్రాణానికి ముప్పు ఉన్న సమయంలో నాకు అత్యవసర చికిత్స ను నిరాకరించారు. డాక్టర్ భైరవి సెంథిల్ నిర్వహించిన తప్పుడు విధానానికి నేను బాధితురాలిని (డాక్టర్ పరీక్షతో సహా) నా వద్ద సాక్ష్యాలు అదే చూపిస్తున్నాయి. అందువల్ల క్షమాపణ ఉండదు.. అని సుదీర్ఘ నోట్ లో పేర్కొన్నారు. తన సేవలో లోపానికి ఒక కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డాక్టర్ ని డిమాండ్ చేశారు రైజా.
అంతకుముందు డాక్టర్ భైరవి ఒక పత్రికా నోట్ లో ఈ వివాదం వెనక కథను వెల్లడించారు, ``ఇంతకుముందు చాలాసార్లు ఇటువంటి క్లినికల్ చికిత్సా విధానానికి వెళ్లిన శ్రీమతి రిజా విల్సన్ ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు. కానీ చివరి సందర్భంలో 16/4/2021 న చికిత్స తర్వాత గాయాలు పెద్దవయ్యాయి. జాగ్రత్తలతో వైద్య సలహాలను ఖచ్చితంగా పాటించకపోతే దుష్ప్రభావాలు అరుదైన సందర్భాలలో కనిపిస్తాయి. మిసెస్ రిజా విల్సన్ చేసిన ప్రకటన అవమానకరమైనది. నా పేరు నా క్లినిక్ పేరు.. ఖ్యాతిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అందువల్ల రిజా విల్సన్‌పై చట్టపరమైన చర్యలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాను. పరువు నష్టం.. నష్టం అలాగే మానసిక వేదనకు తగిన పరిహారం చెల్లించవలసి ఉంటుంది. దీని కోసం మిస్ రిజా విల్సన్ మాత్రమే బాధ్యత వహించాలి అని డాక్టర్ ప్రకటన లో డిమాండ్ చేశారు.