Begin typing your search above and press return to search.
షార్ట్ ఫిలిం బ్యాచ్ తో జాగ్రత్త అన్నారంట!
By: Tupaki Desk | 26 July 2016 4:04 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ యూత్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. కానీ అందరికీ అన్ని అవకాశాలు రావడం లేదు. కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కంటెంట్ లో దమ్ము వుండటమే దానికి కారణం. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీసి... వాటి ద్వారా ఎంతో కొంత ఇండస్ట్రీలో పేరే సంపాదించుకొని... ఆ తరువాత తన వద్ద వున్న బౌండ్ స్క్రిప్టును తీసుకుని నిర్మాతలకోసం వేట ప్రారంభిస్తారు. అలాంటి వాళ్లలో ‘పెళ్లి చూపులు’ చిత్రం డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒకడు. దాదాపు మూడేళ్లపాటు కలవని నిర్మాత అంటూ వుండడు. చివరకు రాజ్ కందుకూరి వద్దకు చేరి తన స్క్రిప్టును తెరమీదకు వచ్చేలా చూసుకున్నాడు. అలాంటి రాజ్ కందుకూరి... షాట్ ఫిలిమ్స్ దర్శకులను ఇప్పుడే కాదు... భవిష్యత్తులో కూడా ప్రోత్సహిస్తానంటున్నాడు. అతడు నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు.
‘ఓ బద్ధకస్తుడైన యువకుడు... ఓ వెల్ నోన్ ఎంటర్ ప్రిన్యూర్ అమ్మాయికి మధ్య జరిగే పెళ్లి చూపులు ఎలాంటి మలుపు తిరగాయనేదే చిత్రం కథ. వినోదాత్మకంతో పాటు... చివరకు నేటి యువతకు మెసేజ్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ అండ్ అతని టీమ్. కాస్ట్ కటింగ్ చేయాలనే ఉద్దేశంతో సింక్ సౌండ్ టెక్నాలజీతో డబ్బింగ్ ఖర్చులు లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటి యువతకు కచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటికే చాలా మందికి ప్రీమియర్ షోలో వేసి చూపించాం. ప్రతి ఒక్కరూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ చిత్రం మొదలు పెట్టాక చాలా మంది షార్ట్ ఫిలిం బ్యాచ్ తో జాగ్రత్త అన్నారు. కానీ.. నాకు స్క్రిప్టు మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వుంది. దాంతో ఈ సినిమా చేశా. ఊహించిన దానికంటే బాగా ఈ సినిమా తెరకెక్కింది’ అన్నారు.
‘నేను దాదాపు ఇప్పటి వరకు ఓ పది సినిమాల వరకు నిర్మించా. నాకు అమెరికాలో గ్రానైట్ బిజినెస్ వున్నా... సినిమా మీద ప్యాషన్ తో సినిమాలను నిర్మిస్తున్నా. మొదట ఈ సినిమా స్క్రిప్టును నిర్మాత డి.సురేష్ బాబు విని నాకు చెప్పారు. విన్న వెంటనే నచ్చింది. ఇప్పుడు దాని అవుట్ పుట్ కనిపిస్తోంది’ అన్నారు.
‘మా నాన్న కోరిక మేరకు ‘గౌతమ్ బుద్ధ’ చిత్రాన్ని తెరకెక్కించి నంది అవార్డుతో సహా అన్ని రకాల అవార్డులను గెలుచుకున్నా. ఈ చిత్రానికి ఆయనే స్క్రిప్టు అందించారు. ఆ చిత్రం కమర్షియల్ గా హిట్ కాదని తెలిసి కూడా...మా నాన్నకోసం ఓ కోటి రూపాయలు పోతేపోనీ అనుకుని ఆ చిత్రాన్ని నిర్మించా. షార్ట్ ఫిలిం తీసే యూత్ కి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. మంచి దమ్మున్న కంటెంట్ తో వస్తే ప్రోత్సహిస్తా. త్వరలోనే మరో సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నా. అలాగే దర్శకత్వం చేసే ఆలోచన కూడా వుంది. అయితే ప్రస్తుతం ‘పెళ్లి చూపులు’ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసి చిత్ర యూనిట్ ను ప్రోత్సహించాలనుకుంటున్నా. నాకున్న అనుబంధంతో డి.సురేష్ బాబు కూడా ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారని’ తెలిపారు.